Congress: మహారాష్ట్ర ఫలితాలు నమ్మేవిధంగా లేవు.. ఆత్మపరిశీలన చేసుకుంటామన్న కాంగ్రెస్

by Shamantha N |
Congress: మహారాష్ట్ర ఫలితాలు నమ్మేవిధంగా లేవు.. ఆత్మపరిశీలన చేసుకుంటామన్న కాంగ్రెస్
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర ఎన్నికల (Maharashtra polls) ఫలితాలు నమ్మశక్యంగా లేదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్(K C Venugopal) అన్నారు. మహారాష్ట్రలో మీడియాతో కాంగ్రెస్ నేతలు మాట్లాడారు. ‘‘ఏం జరిగిందో మాకు నమ్మబుద్ధి కావట్లేదు. ఇది కేవలం కాంగ్రెస్‌ పార్టీ పరాజయం మాత్రమే కాదు.. మహా వికాస్‌ అఘాడీ మొత్తానిది. ముందుగా అసలు ఎక్కడ పొరపాటు చేశామనే దానిపై చర్చలు జరుపుతాం. అందరం కలిసి కూర్చుని ఆత్మపరిశీలన చేసుకుంటాం’’ అని కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. వయనాడ్‌ లోక్‌సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేత ప్రియాంకాగాంధీ(Priyanka Gandhi) భారీ మెజార్టీతో గెలవడంపై వేణుగోపాల్ సంతోషం వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తల సమష్టి కృషి ఫలితంగానే ప్రియాంక గెలిచారని చెప్పుకొచ్చారు. ప్రియాంక భారీ మెజారిటీతో గెలుస్తామని తాము ముందు నుంచి నమ్మకంతో ఉన్నామని తెలిపారు.

ఎంవీఏ ఘోర ఓటమి

మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి సంచలన విజయం సాధించింది. మొత్తం 288 స్థానాలకుగానూ 234 సీట్లను గెలుచుకుంది. ప్రతిపక్ష మహా వికాస్‌ అఘాడీ (MVA) 48 సీట్లకే పరిమితమైంది. కూటమిలో భాగంగా 101 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్‌ కేవలం 16 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. మహారాష్ట్రలో ఎంవీయే ఓటమికి కారణాలను సమష్టిగా పరిశీలిస్తామని కాంగ్రెస్‌ పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed