Mann Ki Baat: మన్ కీ బాత్‌లో అక్కినేని ప్రస్తావన.. ప్రధాని మోడీ ఏం చెప్పారంటే?

by Ramesh N |
Mann Ki Baat: మన్ కీ బాత్‌లో అక్కినేని ప్రస్తావన.. ప్రధాని మోడీ ఏం చెప్పారంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Modi) తెలుగు సినిమా దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao) పై ప్రశంసల జల్లు కురిపించారు. మన్ కీ బాత్‌ (Mann Ki Baat) కార్యక్రమంలో అక్కినేని పేరును ఆయన ప్రస్తావించారు. ఇవాళ మన్‌ కీ బాత్‌ 117వ ఎసిపోడ్‌లో భాగంగా అక్కినేని నాగేశ్వరరావు గురించి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. తెలుగు సినిమా స్థాయిని అక్కినేని నాగేశ్వరరావు మరో స్థాయికి తీసుకు వెళ్లడంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. అక్కినేని నటించిన సినిమాల్లో భారత సంప్రదాయాలు, విలువలు చక్కగా చూపించేవారని ప్రశంసించారు.

మన్ కీ బాత్‌లో పలు సినిమా ఇండస్ట్రీ దిగ్గజాల గురించి ప్రస్తావిస్తూ, తెలుగు సినిమా దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావును ప్రధాని మోడీ కొనియాడటం విశేషం. రాజ్ కపూర్, తపన్ సిన్హా లాంటి బాలీవుడ్ దిగ్గజాల గురించి ప్రధాని మన్ కీ బాత్‌లో ప్రస్తావించారు. అయితే ప్రధాని తెలుగు సినిమా దిగ్గజ నటుల్లో కేవలం అక్కినేని నాగేశ్వరరావును కొనియాడి, మరో దిగ్గజ నటుడు ఎన్టీఆర్ పేరును ప్రస్తావించకపోవడం నెట్టింట చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed