- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
న్యూ ఇయర్ వేళ అందరూ కేకులు కట్ చేస్తే.. ఇక్కడ మాత్రం గొంతు కోసి సెలబ్రేట్
దిశ, వెబ్‌డెస్క్ : ప్రజలంతా ఓ వైపు కొత్త సంవత్సరం వేడుకల్లో మునిగిపోతే.. సూర్యాపేట జిల్లాలో మాత్రం న్యూ ఇయర్, బర్త్ డే పార్టీకి అని పిలిచి ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. అందరూ కేకులు కట్ చేస్తే ఇక్కడ మాత్రం గొంతు కోసి సెలబ్రేట్ చేసుకున్నారు. డిసెంబర్ 31 నైట్ చివ్వెంల మండలంలో జరిగిన ఈ దారుణ హత్యకు సంబంధించిన వివరాలను గ్రామస్తులు వెల్లడించారు. లక్ష్మీ నాయక్ తండాకు చెందిన ధరావత్ శేషు (35)ని సమీప బంధువులు బర్త్ డే, న్యూ ఇయర్ వేడుకలను సెలబ్రేట్ చేసుకుందామని పిలిచారు. కానీ శేషును పార్టీ పేరుతో పిలిచిశ్రీరాం నగర్ కాల్వ మీదుకు తీసుకెళ్లి దారుణంగా గొంతు కోసి హత్య చేశారు. హతుడు సూర్యాపేట జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో అంబులెన్స్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అయితే ఆ రెండు కుటుంబాలకు గత కొన్నాళ్లుగా భూతగాదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు అర్థరాత్రి హుటాహుటిన లక్ష్మీ నాయక్ తండాకు చేరుకోని భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఇరు వర్గాల మధ్య అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టడి చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని సూర్యాపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చరీకి తరలించారు. ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.