ఘనంగా అయ్యప్ప స్వామి కలశ ఊరేగింపు..

by Sumithra |
ఘనంగా అయ్యప్ప స్వామి కలశ ఊరేగింపు..
X

దిశ, మక్తల్ : మక్తల్ పట్టణంలో బుధవారం ఉదయం అయ్యప్ప స్వామి కలశ ఊరేగింపు వీధుల గుండా ఘనంగా జరిగింది. అయ్యప్ప స్వాములు భజనతో అశోక్ గురుస్వామి అనిల్ గురుస్వామి ఆధ్వర్యంలో మక్తల్ పట్టణ పురవీధుల గుండా కలశ ఊరేగింపును నిర్వహించారు. గత 41 సంవత్సరాలుగా మక్తల్ పట్టణంలో అయ్యప్ప స్వాములు మాలలు వేసుకుని 41 రోజుల దీక్ష చేసి అయ్యప్ప స్వామి మహా పూజ నిర్వహించడం ఆనవాయితీ.

అందులో భాగంగా బుధవారం ఉదయం ఆజాద్ నగర్ లో కొలువై ఉన్న ఈశ్వరాలయం నుండి నేతాజీ నగర్ చౌక్ గాంధీ చౌక్ బ్రాహ్మణవాడ యాదవ నగర్ నుండి సినిమా టాకీస్, ఆజాద్ నగర్ సర్కిల్ నుంచి బస్టాండ్ మీదుగా అయ్యప్ప స్వామి మందిరం వరకు అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి వాహనంలో ఉంచి పూర్ణ, పుష్కల, కలశం, అయ్యప్ప స్వామి విగ్రహాన్ని అయ్యప్ప స్వాముల తలపై ఉంచుకుని స్వాములతో బాటు సామాన్య భక్తులు సన్నిధానం వరకు భజనలతో ఊరేగింపు వెళుతున్న కలశానికి మహిళలు భక్తిశ్రద్ధలతో జలాభిషేకం నిర్వహించారు.

Advertisement

Next Story