బైకును ఢీ కొట్టిన లారీ.. దంపతుల మృతి..

by Sumithra |
బైకును ఢీ కొట్టిన లారీ.. దంపతుల మృతి..
X

దిశ, నవీపేట్ : నవీపేట్ మండల కేంద్రంలోని మిషన్ భగీరథ ట్యాంకు సమీపంలో బాసర ప్రధాన రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మండలంలోని ఫకీరాబాద్ కు చెందిన భార్యాభర్తలు మగ్గడి లక్ష్మణ్ (57) మగ్గడి రాజమణి (52) ఘటన స్థలంలో మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం శుక్రవారం రాత్రి నవీపేట్ నుండి తమ స్వగ్రామం ఫకీరాబాద్ కు ద్విచక్ర వాహనం పై వెళ్తుండగా నవీపేట్ శివారులోని ప్రధాన రహదారి పై నిజామాబాద్ వైపు వస్తున్న లారీ ఢీ కొట్టిందని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed