Bhagya shree: సల్మాన్ ఖాన్‌పై హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు.. షూటింగ్ సమయంలో అలా చేశారంటూ?

by Anjali |   ( Updated:2025-01-01 15:40:47.0  )
Bhagya shree: సల్మాన్ ఖాన్‌పై హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు.. షూటింగ్ సమయంలో అలా చేశారంటూ?
X

దిశ, వెబ్‌డెస్క్: తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన హీరోయిన్ భాగ్యశ్రీ(Bhagyashree) పలు విషయాలు పంచుకుంది. ఈ నటి అప్పట్లో మైనే ప్యార్ కియా సినిమాతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కించుకుంది. ఈ మూవీలో భాగ్య శ్రీ సుమన్ రోల్‌లో నటించి.. తన అందం, నటన, అభినయంతో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. అయితే ఇంటర్య్వూలో భాగ్య శ్రీ సల్మాన్ ఖాన్(Salman Khan) గురించి మాట్లాడుతూ.. షూటింగ్ సమయంలో ఆయన్ను అపార్థం చేసుకున్నానని వెల్లడించింది.

మైనే ప్యార్ కియా(Maine Pyar Kia) సినిమా షూటింగ్ టైంలో సల్మాన్ ఖాన్‌తో మంచి రిలేషన్ ఏర్పడిందని చెప్పుకొచ్చింది. ఒకసారి ఆయన నాపక్క కూర్చుని చెవిలో ఒక లవ్ సాంగ్ పాడారని చెప్పింది. ఏమైంది ఆయనకు అనుకున్నాను.. ఆ రోజు మొత్తం నా వెంట పడ్డారని తెలిపింది. సల్మాన్ బిహేవియర్ నాకు అస్సలు అర్థం కాలేదని.. అది కాస్త హద్దులు దాటుతుండగా.. మీరేందుకు ఇలా ప్రవర్తిస్తున్నారని ప్రశ్నించానని.. కోప్పడ్డానని పేర్కొంది.

దీనికి సల్మాన్ బదులిస్తూ.. నీవు ఎవరితో లవ్ లో ఉన్నావో నాకు తెలుసునని పక్కకు తీసుకెళ్లి అన్నారని, నీ ప్రియుడు హిమాలయ అని తెలుసు, ఓసారి షూటింగ్ సెట్ కు పిలవొచ్చుగా అన్నారని వెల్లడించింది. అప్పుడు అస్సలు నా ప్రేమ కథ ఈయనకు ఎలా తెలిసిందబ్బా అని షాక్ అయ్యానని చెప్పింది. ఇక అప్పుడు అర్థం చేసుకున్నాను సల్మాన్ ప్రవర్తనని అని తెలిపింది. నా ప్రేమ కథ గురించే తెలిసి ఆ రోజు ఆటపట్టించాడని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

Read More ...

Rashmika Mandanna: టాలీవుడ్ హీరోను పెళ్లి చేసుకోబోతున్న రష్మిక.. ఎట్టకేలకు హింట్ ఇచ్చిన సినీ నిర్మాత (వీడియో)


Advertisement

Next Story

Most Viewed