Astrology: ధనస్సు రాశిలోకి శని సంచారం.. ఇది శుభమా? అశుభమా ?

by Prasanna |
Astrology: ధనస్సు రాశిలోకి శని సంచారం.. ఇది శుభమా? అశుభమా ?
X

దిశ, వెబ్ డెస్క్ : ఈ రోజు 2025 ఏడాది ప్రారంభమైంది. అయితే, ధనస్సు రాశి వారు ఈ సంవత్సరంలో మిశ్రమ ఫలితాలను పొందనున్నారు. అలాగే, ఇదే సమయంలో ధనస్సు రాశి లోకి శని సంచారం చేయబోతున్నాడు. ఈ కారణంగా ధనుస్సు రాశి వారికీ ఎలా ఉండనుందో ఇక్కడ తెలుసుకుందాం..

ఉద్యోగం మారే అవకాశం ఉంది. అలాగే, వ్యాపారాలు చేసే వారు కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. రాజకీయ జీవితంలో కొన్ని సవాళ్లు ఎదుర్కొనే అవకాశం ఉంది. అలాగే, వ్యవసాయ రంగంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి.

ఆరోగ్యం విషయంలో ఈ ఏడాది చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా, జీర్ణ సంబంధిత సమస్యలు, కడుపు నొప్పి, కీళ్ల నొప్పులు వస్తాయి. ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాల్సి ఉంటుంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం వంటివి చేస్తూ ఉండాలి.

కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీ కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు , మనస్పర్థలు రావొచ్చు. కొన్ని పనులను సహనం, సంయమనంతో వ్యవహరించాలి. మీ జీవిత భాగస్వామితో జాగ్రత్తగా ఉండాలి లేదంటే గొడవలు జరిగే అవకాశం ఉంది.

Advertisement

Next Story