న్యూ ఇయర్ ఎఫెక్ట్.. బిర్లా మందిర్‌కి పొటెత్తిన భక్తులు

by Mahesh |
న్యూ ఇయర్ ఎఫెక్ట్.. బిర్లా మందిర్‌కి పొటెత్తిన భక్తులు
X

దిశ, వెబ్ డెస్క్: న్యూ ఇయర్(New Year) సందర్భంగా 31 డిసెంబర్ నైట్.. డీజే సప్పుల్లతో మహానగర పరిసర ప్రాంతాలు మార్మోగాయి. అయితే జనవరి 1 తెల్లవారు జాము నుంచే.. నగరం వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన ఆలయాల్లో భక్తుల తాకిడి(Devotees flock) భారీగా పెరిగిపోయింది. కొత్త సంవత్సరం మొదటిరోజు హైదరాబాద్, సమీప జిల్లాలైన మేడ్చల్-మల్కాజ్‌గిరి, రంగారెడ్డిలో అన్ని వర్గాల ప్రజలతో స్థానిక దేవాలయాలు కిక్కిరిసి పోయాయి. ఈ క్రమంలోనే నగరం నడిబొడ్డున ఉన్న బిర్లా మందిర్‌(Birla Mandir)కు కూడా భక్తులు పొటెత్తారు. నగర వ్యాప్తంగా ఉన్న ప్రజలు నూతన సంవత్సరం వేళ.. కుటుంబ సభ్యులతో స్వామివారి దర్శనానికి రావడంతో బిర్లా మందిర్ జనసంద్రోహం గా మారిపోయింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా(Social media)లో వైరల్ గా మారాయి. ఇదిలా ఉంటే నగర వ్యాప్తంగా ఉన్న అన్ని దేవాలయాల్లో ఇదే పరిస్థితి నెలకొనగా ప్రధాన ఆలయాలు అయిన చిల్కూర్ బాలాజీ టెంపుల్, టిటిడి శ్రీ వేంకటేశ్వర టెంపుల్, హిమాయత్‌నగర్, జూబ్లీహిల్స్ పెద్దమ్మ టెంపుల్, సికింద్రాబాద్, హైదరాబాదులోని ఇస్కాన్ దేవాలయాలు(ISKCON Temples), బంజారాహిల్స్‌లోని హరే కృష్ణ దేవాలయం, జగన్నాథ స్వామి ఆలయం, శ్రీ కనకదుర్గా నాగలక్ష్మి ఆలయాలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

Advertisement

Next Story

Most Viewed