ఫ్యామిలీతో కలిసి విశాఖకు సీఎం చంద్రబాబు.. ఆర్కే బీచ్‌లో జరిగే వేడుకలకు హాజరు

by srinivas |   ( Updated:2025-01-04 02:21:31.0  )
ఫ్యామిలీతో కలిసి  విశాఖకు సీఎం చంద్రబాబు.. ఆర్కే బీచ్‌లో జరిగే  వేడుకలకు హాజరు
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu) నేడు విశాఖ (Vishaka) వెళ్లనున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌(Hyderabad) నుంచి ఆయన మధ్యాహ్నం బయల్దేరి 3.30 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టు(Vishaka Airport)కు చేరుకుంటారు. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుని 4.45 గంటలకు ఆర్కేబీచ్‌(Rk Beach)కు చేరుకుంటారు. ఆ తర్వాత తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో జరిగే వేడుకలకు చంద్రబాబు కుటుంబం హాజరవుతుంది. నేవీ విన్యాసాలను వీక్షిస్తారు. సాయంత్రం 6.30 గంటలకు గవర్నర్‌ బంగ్లా సమీప తూర్పు నౌకాదళాధిపతి నివాసంలో జరిగే తేనేటి విందుకు హాజరవుతారు. రాత్రి 7.15 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు పయనమవుతారు. ఈ మేరకు సీఎం విశాఖ టూర్‌కు సంబంధించి అధికార యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో జరిగే వేడుకలకు అటు టీడీపీ నేతలు కూడా భారీగా హాజరుకానున్నారు.

Advertisement

Next Story

Most Viewed