Dirty politics:కాంగ్రెస్ నీచ రాజకీయాలు చేస్తుంది- కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి

by Shamantha N |
Dirty politics:కాంగ్రెస్ నీచ రాజకీయాలు చేస్తుంది- కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి
X

దిశ, నేషనల్ బ్యూరో: మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ (former Prime Minister Manmohan Singh)స్మారకం ఏర్పాటుపై కాంగ్రెస్ విమర్శలకు కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి(Union Minister Hardeep Singh Puri) కౌంటర్ ఇచ్చారు. “ఏ వివాదాలు లేవని.. మన్మోహన్ స్మారకం ఏర్పాటుపై వివాదాన్ని సృష్టిస్తోంది. కాంగ్రెస్(Congress) నీచ రాజకీయాలు చేస్తోంది.”అని మండిపడ్డారు. “కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే లేఖ రాశారు. వారి అభ్యర్థనను అంగీకరిస్తూ హోం మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. మన్మోహన్ సింగ్ మరణించిన మరుసటి రోజు అర్ధరాత్రి దాటాక ఖర్గే లేక మాకు చేరింది’’ అని పూరి తెలిపారు. "మేము ఎల్లప్పుడూ ఆయన పనిని మెచ్చుకున్నాం. ఆయన నుంచి ప్రేరణ పొందాం. మన్మోహన్ సింగ్ గౌరవార్థం కచ్చితంగా స్మారక చిహ్నం నిర్మిస్తాం. వివాదాలు సృష్టించే వారిని ఎంటర్ టైన్ చేయాలని నేను అనుకోవట్లేదు. మన్మోహన్ వారసత్వానికి గౌరవం ఇవ్వాలి” అని పూరి చెప్పుకొచ్చారు.

అంత్యక్రియల తర్వాత..

మన్మోహన్ సింగ్ అంత్యక్రియల వివాదంపైనా హర్దీప్ సింగ్ పూరి ఘాటుగా బదులిచ్చారు. “రాజ్‌ఘాట్ చుట్టుపక్కల ప్రాంతం చదునుగా ఉంటుంది. నీటి నిలిచే అవకాశం ఉంది. ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. ఇలాంటి పరిస్థితుల్లో తక్కువ సమయంలో నిర్మాణాలు చేపట్టడం సాధ్యమేనా అని కాంగ్రెస్‌ను అడగండి’’ అని ఆయన చురకలు అంటించారు. మంత్రివర్గం పరిమితులకు లోబడి పనిచేసిందని అన్నారు. గతంలో కాంగ్రెస్ తన సొంత పార్టీ నేతలనే అవమానించిందని అన్నారు. “పీవీ నరసింహారావు భౌతికకాయాన్ని పార్టీ ప్రధాన కార్యాలయానికి రానివ్వలేదని అన్నారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ బీజింగ్ వెళ్లి ఆయనకు తెలియకుండానే ఎంఓయూపై సంతకం చేసింది. ప్రధాని పదవి నుంచి వీడ్కోలు తీసుకున్నప్పుడు.. కాంగ్రెస్ 'యువ నేత'లు కనిపించలేదు. మన్మోహన్ చితాభస్మ నిమజ్జనం జరిగినప్పుడు అక్కడ బీజేపీ నాయకులే ఉన్నారు. కాంగ్రెస్ నేతలు కాదు' అని ఆయన ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed