- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చేపల వల కాళ్లకు చుట్టుకుని వ్యక్తి మృతి..
దిశ, నిజాంసాగర్ : చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు చేపల వల కాళ్లకు చుట్టుకుని వ్యక్తి మృతి చెందిన సంఘటన కొమలాంచ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానిక ఎస్ఐ శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం బాన్సువాడ మండలంలోని తిరుమలాపూర్ గ్రామానికి చెందిన బెస్త సాయిలు (36) మహమ్మద్ నగర్ మండలం కొమలాంచ గ్రామ శివారులోని మంజీరా నదిలో అదే గ్రామానికి చెందిన నక్కల సాయిలు, అంకాసి సాయిలు, కోళ్ల గంగారంతో కలిసి మంగళవారం చేపలు పట్టేందుకు వెళ్లారు.
చేపలు పడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు బెస్త సాయిలు కాళ్లకు వల చుట్టుకొని నీటిలో నుంచి బయటకు రాలేక మృత్తి చెందాడు. మృతుడికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. భార్య విడాకులు కోరుతూ భర్తకు దూరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని శవపంచనామ నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ శివకుమార్ తెలిపారు.