సాహిబ్జాదేస్ త్యాగానికి ప్రతీక "వీర్ బాల్ దివస్"..

by Sumithra |
సాహిబ్జాదేస్ త్యాగానికి ప్రతీక వీర్ బాల్ దివస్..
X

దిశ, గోదావరిఖని : సాహిబ్జాదేస్ త్యాగానికి ప్రతీక వీర్ బాల్ దివస్ అని రామగుండం నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ ఇంచార్జి కందుల సంధ్యారాణి కొనియాడారు. ఆదివారం ఎన్టీపీసీ పీకే రామయ్య కాలనీలో బీజేపీ సీనియర్ నాయకులు తోట కుమారస్వామి ఆధ్వర్యంలో వీర్ బాల్ దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి మాట్లాడారు. గురు గోవింద్ సింగ్‌ కుమారులు సాహిబ్జాదా జోరావర్ సింగ్, సాహిబ్జాదా ఫతే సింగ్‌ల చిత్రపటాలకు పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. వారి బలిదానం గుర్తుగా బల్ దివస్ గా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించడం చాలా సంతోషమన్నారు. లక్షలాది మందికి శక్తి స్ఫూర్తిగా నిలుస్తుంది అని అన్నారు.

మొఘలులను ఎదిరించిన ఆ చిన్నారుల బలిదానపు త్యాగాలు ప్రశంసనీయమని అన్నారు. వీర్ బాల్ దివస్ భారత దేశ చరిత్రలోని ఒక అపూర్వ అధ్యాయాన్ని గుర్తు చేస్తుందని తెలిపారు. నేటి బాలలు సైతం అదే స్ఫూర్తితో జీవితంలో ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మిట్టపల్లి సతీశ్, తోట కుమార స్వామి, ఆశిష్ అగర్వాల్, విక్రమ్ ఆదిత్య, సదానందం, పల్లికొండ నర్సింగ్, ప్రకాశ్, రఘు సింగ్,అజీత్ సింగ్, దుర్గా ప్రసాద్, మంగళ సింగ్, లోచన సింగ్, అనిల్ సింగ్, విక్రం సింగ్, జర్నల్ సింగ్, బల్వీర్ సింగ్, దౌలత్ సింగ్, సొరన్ సింగ్, గుల్దీప్ సింగ్, బచన్ సింగ్, అర్జున్ సింగ్, ధర్మేందర్ సింగ్, జితెందర్ సింగ్, గోవింద్ సింగ్, కల్యాణ్ సింగ్, కిర్బల్ సింగ్, పవన్ సింగ్, గురునానక్ సింగ్, ఆనంద్ సింగ్, షేర్ సింగ్, జీవన్ మంగ్రాజ్, గోప బంధు, పనిగ్రాయ్, విజయ్ సాగర్, దీప్ టీకే, మాదన్ క్షత్రియ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed