‘తెలుసు కదా’ మూవీ నుంచి హీరో ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల..

by Hamsa |
‘తెలుసు కదా’ మూవీ నుంచి హీరో ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల..
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) ‘డిజే టిల్లు’ సినిమాతో ఫుల్ ఫేమ్ తెచ్చుకున్నాడు. గత ఏడాది ‘టిల్లు స్వ్కేర్’(Tillu Square) చిత్రంతో ప్రేక్షకులను అలరించిన ఆయన వరుస సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డ, నీరజ కోన(Neeraja Kona) కాంబినేషన్‌లో రాబోతున్నట్లు తాజా చిత్రం ‘తెలుసు కదా’(TelusuKada).

ఇందులో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty), రాశీఖన్నా హీరోయిన్లుగా నటించనున్నారు. దీనికి తమన్ సంగీతం అందిస్తుండగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(People Media Factory) నిర్మించనుంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి వరుస అప్డేట్ విడుదల అవుతూ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంటున్నాయి. నేడు కొత్త సంవత్సరం సందర్భంగా సిద్దు జొన్నలగడ్డ లుక్‌ను షేర్ చేశారు. ఇందులో కాలేజి బ్యాగ్ వేసుకుని ఓ ఎస్టీడీ బూత్ వద్ద ఎవరితోనే ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు కనిపించాడు.

Advertisement

Next Story

Most Viewed