Game Changer: గేమ్ చేంజర్ టికెట్ల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

by Prasanna |   ( Updated:2025-01-01 15:33:59.0  )
Game Changer: గేమ్ చేంజర్ టికెట్ల పెంపునకు  రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రతి ఏడాది సంక్రాంతికి కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అయితే, ఈ సంవత్సరం ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న.. మూడు సినిమాలు రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. దీనిలో ఒకటి రామ్ చరణ్ "గేమ్ ఛేంజర్ " ( Game Changer)రెండోది బాలకృష్ణ " డాకూ మహారాజ్ " ( Daaku Maharaaj ), మూడోది వెంకటేష్ " సంక్రాంతికి వస్తున్నాం " ( sankranthiki vasthunnam ) సినిమాలు మన ముందుకు వస్తున్నాయి.

అయితే, ఈ మూడు సినిమాల పైన భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మధ్య తెలంగాణలో జరిగిన పుష్ప ఇన్సిడెంట్ వలన టికెట్ల రేట్లు గురించి గత కొద్ది రోజుల నుంచి చర్చ మొదలైంది. తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉంటాయా..? టికెట్ రేట్లు పెరుగుతాయా ఆడియెన్స్ ఎదురుచూస్తున్న సమయంలో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త సినిమాలకు టికెట్ ధరలను పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. ఈ నిర్ణయం సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక చర్చలకు దారితీసింది.

రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ఈ సినిమా టికెట్ ధరలను సింగిల్ స్క్రీన్స్‌లో రూ. 135, మల్టీప్లెక్స్‌లలో రూ. 175గా నిర్ణయించారు. బెనిఫిట్ షోలకు రూ. 600 టికెట్ రేటును ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. దీంతో సినిమా రిలీజ్ రోజున వసూళ్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి.

Read More ...

Game Changer: గేమ్ చేంజర్ టికెట్ల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్


Advertisement

Next Story