AP News:జనసేనలో చేరుతారనే ప్రచారం పై స్పందించిన తమ్మినేని

by Jakkula Mamatha |
AP News:జనసేనలో చేరుతారనే ప్రచారం పై స్పందించిన తమ్మినేని
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి అనంతరం తమ్మినేని సీతారాంను శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం పరిశీలకులుగా వైసీపీ నియమించిన విషయం తెలిసిందే. తమ్మినేని సొంత నియోజకవర్గం ఆముదాలవలసకి కొత్త ఇన్‌చార్జిని నియమించారు. ఈ నేపథ్యంలోనే తమ్మినేని అసంతృప్తితో ఉన్నారని, జనసేన(Janasena)లో చేరితే తమ భవిష్యత్తు బాగుంటుంది అని తమ్మినేని కుటుంబం ఆలోచిస్తోందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

ఈ క్రమంలో సామాజిక మాధ్యమా(Social Media)ల్లో జరుగుతోన్న ప్రచారం పై తాజాగా తమ్మినేని సీతారాం(Tammineni Sitaram) తీవ్రంగా స్పందించారు. ఈ క్రమంలో తమ్మినేని మాట్లాడుతూ.. ‘ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. ఇటీవలే నా కుమారుడిని ఆసుపత్రిలో చేర్పించాను. 15 రోజులుగా ఆసుపత్రి దగ్గరే ఉన్నాను. పార్టీ కార్యక్రమాలకు అందుకే దూరంగా ఉన్నాను అని తెలిపారు. అయినా నాకు జనసేనలో చేరాల్సిన అవసరమేంటి?’ అని పేర్కొన్నారు.

Advertisement

Next Story