Parliament: రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. కీలక బిల్లులకు కేంద్రం సిద్ధం

by Ramesh N |   ( Updated:2024-11-24 07:37:29.0  )
Parliament: రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. కీలక బిల్లులకు కేంద్రం సిద్ధం
X

దిశ, డైనమిక్ బ్యూరో: పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు(Winter Parliament Sessions) రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 25 నుంచి డిసెంబర్‌ 20 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. తాజాగా పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో పార్లమెంట్‌లో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు జరిగంది. సెషన్లలో రానున్న బిల్లులు, వివిధ అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.

ఈ సందర్భంగా పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేలా సహకరించాలని వివిధ పార్టీలను కేంద్రం కోరింది. వక్ఫ్ బోర్డు ( Wakf Board ) సవరణ బిల్లు సహా పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాగా, ఈ సమావేశాల్లో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రైతుల సమస్యలు తదితర అంశాలపై వాడీవేడి చర్చ జరిగే అవకాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed