‘భైరతి రణగల్’ ట్రైలర్ విడుదల.. మాస్ డైలాగ్స్‌తో అదరగొట్టిన శివరాజ్ కుమార్

by Hamsa |   ( Updated:2024-11-24 10:13:49.0  )
‘భైరతి రణగల్’ ట్రైలర్ విడుదల.. మాస్ డైలాగ్స్‌తో అదరగొట్టిన శివరాజ్ కుమార్
X

దిశ, సినిమా: కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్(Shivaraj Kumar) ఓ వైపు కామియో రోల్స్ చేస్తూనే హీరోగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రజెంట్ ఆయన ‘భైరతి రణగల్’ (Bhairathi Rangal)మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే ఈ చిత్రానికి నర్తన్ దర్శకత్వం వహిస్తుంగా.. ఇందులో ‘సప్త సాగరాలు దాటి’ హీరోయిన్ రుక్మిణి వసంత్(Rukmini Vasanth) నటిస్తుంది. ఈ మూవీ నవంబర్ 15న కన్నడలో విడుదలై భారీ హిట్ అందుకుంది. ఈ సినిమాను మేకర్స్ ఇప్పుడు తెలుగు, తమిళంలోనూ డబ్ చేస్తున్నారు.

ఈ రెండు భాషల్లో నవంబర్ 29న థియేటర్స్‌లోకి రాబోతుంది. దీనిని గీతా పిక్చర్స్(Geetha Pictures) బ్యానర్స్‌పై గీతా శివరాజ్ కుమార్ నిర్మిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ‘భైరతి రణగల్’ సినిమా తెలుగు ట్రైలర్‌‌ను‌ టాలీవుడ్ హీరో నాని(Nani) లాంచ్ చేయగా.. తమిళంలో శివకార్తికేయన్ రిలీజ్ చేయబోతున్నాడు. ఈ మేరకు నాని ట్రైలర్‌(Trailer)ను షేర్ చేస్తూ శివరాజ్ కుమార్‌ను ఆల్ ది బెస్ట్ చెప్పారు. అయితే ఇందులో శివరాజ్ కుమార్(Shivaraj Kumar) మాస్ డైలాగ్స్‌తో దుమ్ములేపారు. ‘‘ఇకపైన రుణాపురంలో ఉండేది సర్వే రాళ్లు కాదు. రణగల్ సామ్రాజ్యపు మైలు రాళ్లు. జనాల కోసం నేను ఎవ్వరినైనా పోగొట్టుకుంటాను. కానీ జనాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడను’’ అని కత్తి పట్టుకుని విలన్స్‌ తాటతీశారు. ప్రజెంట్ ‘భైరతి రణగల్’ ట్రైలర్ నెట్టింట వైరల్ అవుతోంది.


Next Story

Most Viewed