- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Winter: చలికాలంలో బద్ధకాన్ని వీడాలనుకుంటున్నారా.. ఈ పనులు చేయండి!!
దిశ, వెబ్‌డెస్క్: బద్ధకం(laziness) అనేది స్పృహలో అసాధారణ తగ్గుదలని కలిగి ఉన్న ఒక లక్షణం. మీ స్పృహ స్థాయి తగ్గడం మీ మానసిక స్థితిలో మార్పును కలిగి ఉంటుంది. బద్ధకం వల్ల మీరు అన్ని విషయాలను గుర్తుంచుకోవడంలో సమస్యను ఎదుర్కోవచ్చు. అయితే ఈ బద్ధకం వింటర్ సీజన్(Winter season)లో మరింత ఎక్కువగా ఉంటుంది. చలికాలం రాగానే బద్ధకం ఆవహిస్తుంది. పొద్దు పొద్దన్నే నిద్ర లేవాలంటే అస్సలు నచ్చదు. శరీరం మొత్తం చాలా లేజీగా ఉంటుంది.
ఏ పని చేయడానికి కూడా ఒళ్లు సహకరించదు.పైగా చలికాలంలో సూర్య రశ్మి(sunlight) తక్కువగా ఉండటంతో శరీరానికి కావాల్సిన విటమిన్ డి(Vitamin D) సరిగ్గా అందదు. దీంతో నీరసంగా మారిపోతారు. ఒకవేళ శారీరకంగా యాక్టివ్‌గా ఉన్నా.. పలు వ్యాధులు దరిచేరి వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాగా చలికాలంలో బద్ధకాన్ని తరిమికొట్టి.. రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే.. ఈ ఆరు పనులు చేయాలంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
చలికాలంలో బాడీ చురుగ్గా ఉండాలంటే.. ప్రతిరోజూ ఉదయం కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్(walking) చేస్తే చాలు. పైగా వాకింగ్ చేయడం వల్ల పలు అనారోగ్య సమస్యల(Health problems)కు చెక్ పెట్టొచ్చు. అలాగే రోజూ రాత్రి సరైన సమయానికి నిద్రపోవాలి. దీంతో ఆటోమేటిక్‌గా మార్నింగ్ గా లేవడానికి ఇష్టపడుతారు. బద్ధకం దరిచేరదు. చలికాలంలో బాడీని యాక్టివ్‌గా ఉంచుకోవడం కోసం యోగా తప్పనిసరి అంటున్నారు నిపుణులు. యోగా చేస్తే శరీరానికి ఎనర్జీ వస్తుంది. బ్లడ్ సర్కులేషన్(Blood circulation) సాఫీగా జరుగుతుంది.
వీటితో పాటు వాకింగ్ చేయడానికి టైమ్ దొరకనప్పుడు ఇంటి పనులు కూడా చేయండి. పనులు చేస్తే ఇంట్లో మీ భాగస్వామికి హెల్స్ చేసినట్లు ఉంటుంది. ఇంట్లోనే మీకు ఇష్టమైన సాంగ్స్ పెట్టుకుని డ్యాన్స్(Dance) చేయండి. వాస్తవానికి అయితే డ్యాన్స్ చేయడం వల్ల బాడీ ఫిట్(Body fit)గా మారుతుంది. శారీరకంగా చాలా యాక్టివ్‌గా ఉంటారు. మైండ్ ప్రశాంతంగా ఉంటుంది కూడా. చలికారణంగా చాలా మంది ఎక్కువగా వాటర్ తీసుకోరు. దీంతో బాడీ హైడ్రేట్(Hydrate) గా ఉండదు. కాగా సమ్మర్‌లో ఎంత వాటర్ తీసుకుంటారో శీతాకాలంలో కూడా శరీరానికి అంతే నీళ్లు అవసరం.