- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అఖిలపక్ష సమావేశంలో మేం కోరింది ఇవే : ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు
దిశ, వెబ్ డెస్క్: రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు (Parliament Sessions) ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో నేడు నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి (All Party Meeting) ఎంపీ, టీడీపీ పార్లమెంటరీ పార్టీనేత లావు శ్రీకృష్ణదేవరాయలు (Sri Krishna Devarayalu) హాజరయ్యారు. అఖిలపక్ష సమావేశంలో.. రేపట్నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ఏపీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించాలని కోరినట్లు తెలిపారు. అఖిలపక్ష సమావేశంలో విభజన హామీలు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, ప్రాజెక్ట్ పనులు మళ్లీ మొదటికి ఎందుకు వచ్చాయి?, విజయవాడ వరదల నేపథ్యంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ అంశాల గురించి చర్చించాలని కోరామన్నారు. అలాగే.. సోషల్ మీడియా వేధింపులు గురించి పార్లమెంటులో చర్చించి.. వాటిని కట్టడి చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో అందరి నుంచి అభిప్రాయాలను సేకరించాలని కోరామన్నారు.
ముస్లిం మైనారిటీ సోదరుల అభిప్రాయాలను గౌరవిస్తూ, వారికి ఇబ్బంది లేకుండా వక్ఫ్ చట్ట సవరణ చేయాలని జాయింట్ పార్లమెంటరీ కమిటీలోనే సూచించామని, ఆంధ్రప్రదేశ్ సాధించిన ఘనతలపై అంతర్జాతీయంగా చర్చ జరగాల్సిన చోట, అపకీర్తి మూటగట్టుకునే అంశాలపై రాష్ట్రం పేరు బయటికి రావడం బాధాకరమన్నారు. ఇక గోదావరి - పెన్నా నదుల అనుసంధానంపై కూడా ఒక్క అడుగు ముందుకు పడలేదని, అది పూర్తయితే 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. అందుకే నదుల అనుసంధానంపై చర్చించాలని విజ్ఞప్తి చేశామన్నారు. విదేశాలకు వలసవెళ్లి ఇబ్బందులు పడుతున్నవారి కోసం చట్టం తీసుకురావాలని కేంద్రాన్ని కోరినట్లు లావు తెలిపారు.