- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
వారిని మోదీ, అమిత్ షా వదలరు.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

దిశ, వెబ్ డెస్క్: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిపై గోషామహల్ (Goshamahal) బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (BJP MLA Rajasingh) స్పందించారు. ఈ మేరకు ఓ ప్రకటన ద్వారా ఉగ్రవాదులను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రాజాసింగ్ ఉగ్రదాడి (Terrorist Attack)లో మృతి చెందిన వారికి నివాళులు (Tributes) అర్పించారు. అలాగే దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. అంతేగాక వారి కుటుంబాల పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఇక అమాయక ప్రజలపై జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తున్నానని చెబుతూ.. ఉగ్రవాదులను ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi), కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Union Minister Amit Shah) వదలరు అని అన్నారు. కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు (Article 370 Ban) చేశాక అంతా ప్రశాంతంగా ఉందని, కాశ్మీర్‌ను అభివృద్ధి చేసేందుకు కేంద్రం తీవ్రంగా కృషి చేస్తోందని తెలిపారు. ప్రశాంతంగా ఉన్న కాశ్మీర్ లో పాక్ నుంచి ఉగ్రవాదులు వచ్చి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఉగ్రవాదులను పట్టుకునే వరకు మోదీ, అమిత్ షా వదలరు అని రాజాసింగ్ అన్నారు. కాగా మంగళవారం పహల్గామ్ (Pahalgam)లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిలో ఇప్పటివరకు 28 మంది మృతి చెందారు. మరి కొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య మరికొంత పెరిగే అవకాశం ఉంది. ఉగ్రవాదుల కోసం కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ టిక్కా పేరుతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే ఉగ్రవాదుల ఊహాచిత్రాలను కూడా విడుదల చేసింది.