Nabeel Afridi: బిగ్‌బాస్‌లో దూసుకెళ్తున్న ఓరుగ‌ల్లు కుర్రోడు

by Bhoopathi Nagaiah |
Nabeel Afridi: బిగ్‌బాస్‌లో దూసుకెళ్తున్న ఓరుగ‌ల్లు కుర్రోడు
X

దిశ‌, వరంగల్ బ్యూరో : ప్రజెంట్ బిగ్‌బాస్ సీజన్-8 ఫైనల్(Bigg Boss-8 season) దశకు చేరుకుంటోంది. ఈ క్రమంలోనే తన ఆట తీరుతో హౌస్‌లో ఓరుగ‌ల్లు(Warangal) కుర్రాడు దూసుకెళ్తున్నాడు. మ‌రో రెండు వారాలు మాత్రమే షో మిగిలి ఉన్న నేప‌థ్యంలో అంద‌రి దృష్టిని న‌బీల్ ఆఫ్రిది(Nabeel Afridi) ఆక‌ర్షిస్తున్నాడు. ఎంతో ఓర్పు, స‌హ‌నంతో ప‌ట్టుద‌ల‌తో ఆడుతున్న న‌బీల్‌కు అభిమానులు మ‌ద్దతుగా నిలుస్తున్నారు. ప్రతీవారం నామినేషన్‌లోకి వస్తున్నప్పటికీ ప్రేక్షకుల ఓట్లు పొందుతూ ఛాంపియ‌న్(Champion) లీడ్‌లో ఉండ‌టం గ‌మ‌నార్హం.

హ‌న్మకొండ రాఘ‌వేంద్ర కాల‌నీకి చెందిన మ‌హ‌మ్మద్ షౌక‌త్ అలీ, న‌జ్మ న‌స్రత్‌ల కుమారుడైన న‌బీల్ ఆఫ్రిది చైత‌న్య డిగ్రీ కాలేజీలో గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేశాడు. అనంత‌రం త‌న‌కు ఎంతో ఇష్టమైన న‌ట‌న‌పైపు ప్రయ‌త్నాలు సాగించాడు. ఈక్రమంలోనే ఆఫ్రిది స్టార్ట్ చేసిన వ‌రంగ‌ల్ డైరీ(Warangal Diary) యూట్యూబ్ చానల్ బంప‌ర్ హిట్టయింది. చాలా త‌క్కువ సమ‌యంలో ఈ యూట్యూబ్ చానల్‌కు ఏకంగా 2మిలియ‌న్ స‌బ్ స్క్రైబ‌ర్స్‌ను సంపాదించుకున్నాడంటే న‌బీల్ టాలెంట్‌ను మనం అంచ‌నా వేయవ‌చ్చు. ఇక యాక్టర్ కావాల‌నే ల‌క్ష్యంతో ప్రయ‌త్నాలు మొదలు పెట్టిన న‌బీల్‌కు బిగ్‌బాస్ షోపై ఆస‌క్తి క‌లిగి 2023లో ఆడిష‌న్స్‌కు అటెండయ్యాడు. అయితే దుర‌దృష్టంతో సెలెక్ట్ కాలేదు. ఇక ఫెయిల్యూర్‌ను కూడా పాజిటివ్‌గా తీసుకున్న న‌బీల్ 2024లో ఆడిష‌న్స్‌కు వెళ్లగా.. మ‌నోడి టాలెంట్‌కు బిగ్‌బాస్ షో ఎంట్రీకార్డు ల‌భించింది.

బిగ్‌బాస్ షో అంటేనే ప‌రీక్షల‌కు వేదిక‌.. మ‌న మానసిక స్థితికి, అల‌వాట్లు, ప్రవ‌ర్తన‌కు, స‌మ‌న్వయం చేసుకుంటూ మిగ‌తా టీం స‌భ్యుల‌తో క‌లిసి ఆడుతూ బిగ్‌బాస్ మ‌న‌సు చూర‌గొనాల్సి ఉంటుంది. న‌బీల్‌కు ఈ విష‌యంలో దండిగానే మార్కులు ప‌డుతున్నాయి. ఈ క్రమంలోనే నబీల్ గెలుపు దిశగా ప్రయాణిస్తున్నాడు. మ‌రో రెండు వారాల్లో ఫైన‌ల్స్ పూర్తికానున్న నేప‌థ్యంలో న‌బీల్ ఆఫ్రిది త‌న ఆట‌తీరుతో అంద‌రి దృష్టిని ఆక‌ట్టుకుంటున్నాడు. త‌న‌కు ప్రేక్షకులు మ‌ద్దతుగా నిల‌వాల‌ని కోరుతున్నాడు. ప్రేక్షకుల మ‌ద్దతులోనూ మ‌నోడు ముందువ‌రుస‌లోనే ఉన్నాడు. ఈసారి ఓరుగ‌ల్లు కుర్రాడు బిగ్‌బాస్ చాంపియ‌న్‌గా నిలిచే అవ‌కాశం ఉంద‌న్న విశ్లేష‌ణ‌లు కూడా బ‌లంగా వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో త‌న కుమారుడి ప్రేక్షకులు అండ‌గా నిల‌వాల‌ని షౌక‌త్ అలీ, త‌ల్లి న‌జ్మ న‌స్రత్‌తో పాటు న‌బీల్ మేన‌మామ షుజ‌త్ అలీ కోరుతున్నారు. వ‌రంగ‌ల్ కుర్రోడు ఛాంపియ‌న్‌గా నిల‌వాల‌ని మనం కూడా కోరుకుని ఓట్లు వేసి గెలిపిద్దాం.

Advertisement

Next Story