- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బనకచర్ల ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి అభ్యంతరం.. అధికారులకు కీలక ఆదేశాలు
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మంగా చేపట్టదలచిన బనకచర్ల ప్రాజెక్టు(Banakacharla project)పై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అభ్యంతరం(Objection) వ్యక్తం చేశారు. ఈ రోజు తెలంగాణ సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో అధికారులతో ఆయన మాట్లాడుతూ.. బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వానికి తమ అభ్యంతరాన్ని తెలపాలని అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశించారు.అవసరమైతే గోదావరి రివర్డ్ బోర్డు(Godavari Reward Board), కేంద్ర జల్‌శక్తి(Central Hydropower Department)కి లేఖలు రాయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇదిలా ఉంటే ఇటీవలను ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు(Andhra Pradesh CM Chandrababu) నాయుడు మంత్రులు ఇరిగేషన్ అధికారులతో బనకచర్ల ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నదుల అనుసంధానం చేస్తేనే రాష్ట్రానికి ఉపయోగంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఇప్పటికే కృష్ణా, గోదావరి తో పాటు ఇతర రాష్ట్రాలపై తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలు వేర్వేరు ప్రాంతాల్లో ప్రాజెక్టులు నిర్మించుకున్నారని, మనం కేవలం ఈ ప్రాజెక్టు ద్వారా చిట్టచివరకు వచ్చిన వరద జలాలను ఇతర నదులకు తరలిస్తామని.. దీంతో ఏ రాష్ట్రంతో నీటి సమస్య ఉండదని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు. అలాగే స్వర్ణాంధ్ర-2047 లో నీటి వనరులకు ప్రాధాన్యత ఇచ్చామని నొక్కి చెప్పారు.