సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి

by Naveena |
సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి
X

దిశ, కామారెడ్డి టౌన్ : తమ సేవలను గుర్తించి రెగ్యులర్ చేయాలని కామారెడ్డి జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగులు మున్సిపల్ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి నిజాం సాగర్ చౌరస్తాలో మానవహారం నిర్వహించారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయమని సీఎం అన్న మాటలను ఖండిస్తూ..ఎన్నికల్లో ఇచ్చిన గత ప్రభుత్వంలో సమ్మె చేస్తున్నప్పుడు ఇచ్చిన హామీని సీఎం రేవంత్ రెడ్డి,మంత్రులు మర్చిపోయి సాధ్యం కాదని చెప్పడం విడ్డూరమన్నారు. పంజాబ్, హర్యానా, సిక్కిం, జమ్ము కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లాంటి ఇతర రాష్ట్రాలలో సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేశారని, తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు చేయ్యారని ప్రశ్నించారు. హైకోర్టు ఇచ్చిన 16 జీవో క్రమబద్ధీకరణకు అడ్డొస్తే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సమాన పనికి సమాన వేతనం ఎందుకు ఇవ్వారని ,ఇదేనా కాంగ్రెస్ ప్రజా పాలన అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం నిర్వహించే క్యాబినెట్ సమావేశంలో తమ అంశాన్ని చర్చించి పరిష్కారం చూపాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed