- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వలస గుత్తి కోయ గ్రామాలకు పోలీస్ రక్షణ
దిశ, మణుగూరు : జిల్లాలోని వలస గుత్తి కోయ గ్రామాలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉండి రక్షణ కల్పిస్తుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ అన్నారు. శనివారం మణుగూరు, పినపాక మండలాల్లో సబ్ డివిజన్ డీఎస్పీ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్పీ రోహిత్ రాజ్ విస్తృతంగా పర్యటించారు. ముందుగా మణుగూరు పోలీస్ స్టేషన్ ను సందర్శించి పోలీసుల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం పోలీస్ కార్యాలయంలో రూ. 6 లక్షలతో కూడిన 90 సీసీ కెమెరాలు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్క వ్యాపారస్తులు తమ వ్యాపారం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల నేరాలు, ఘోరాలు తగ్గుతాయన్నారు.
అనంతరం ఏడూళ్ల బయ్యారం పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. పినపాక పోలీసుల ఆధ్వర్యంలో తిర్లాపురం, మల్లారం, పిట్టతోగు గ్రామాలలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ ఉచిత మెగా వైద్య శిబిరానికి సుమారుగా 65 కుటుంబాల నుండి 300 మంది ఆదివాసీ ప్రజలు పాల్గొన్నారు. విద్య, వైద్య, రవాణా సౌకర్యాలను వారికి కల్పించేందుకు అన్ని శాఖల అధికారులతో సమన్వయం పాటిస్తూ మెరుగైన జీవితాన్ని అందించడానికి ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేసే పోలీసు అధికారులందరూ నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే పథకాలన్నింటిని కూడా వారికి అందే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీ నాయకులు అభివృద్ధి నిరోధకులుగా మారి ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసీ ప్రజలను అభివృద్ధికి దూరం చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికే మావోయిస్టు పార్టీ అగ్రనాయకుల వేధింపులు తట్టుకోలేక చాలామంది దళసభ్యులు, నాయకులు పోలీసుల ఎదుట లొంగిపోవడం జరుగుతుందని తెలిపారు. ఎవరైనా కొత్త వ్యక్తులు తమ గ్రామాల్లోకి ప్రవేశిస్తే వెంటనే పోలీస్ వారికి సమాచారం అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామస్తులందరికీ సోలార్ లైట్లు, దుప్పట్లను పంపిణీ చేశారు. యువతకు వాలీబాల్ కిట్లను కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో మణుగూరు సబ్ డివిజన్ డీఎస్పీ రవీందర్ రెడ్డి, మణుగూరు సీఐ సతీష్, ఎస్సైలు మేడ ప్రసాద్, రంజిత్, ఏడూళ్లబయ్యారం సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సైలు రాజ్ కుమార్, రాజేందర్, సిబ్బంది, వైద్య బృందం పాల్గొన్నారు.