sankranthiki vasthunnam: ఇది దేవుని దయగా భావిస్తున్నాను.. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ కామెంట్స్

by sudharani |
sankranthiki vasthunnam: ఇది దేవుని దయగా భావిస్తున్నాను.. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ కామెంట్స్
X

దిశ, సినిమా: విక్టరీ వెంకటేష్ (Venkatesh), అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబోలో వస్తున్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ (sankranthiki vasthunnam). శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కొలాబరేషన్‌లో వస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీని దిల్ రాజు సమర్పణలో శిరీష్ గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో (Bheems Cicerolio) సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు సెన్సేషనల్ హిట్‌గా నిలిచి సినిమాపై హ్యుజ్ బజ్ (Huge buzz) క్రియేట్ చేశాయి. జనవరి 14న ‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో మీడియాతో ముచ్చటించి సినిమా విశేషాల్ని పంచుకున్నారు.

‘నాకు ఈ అవకాశం ఇచ్చిన అనిల్‌కు థాంక్స్. ధమాక, మ్యాడ్, బలగం, రజాకార్, టిల్లు స్క్వేర్.. ఇలా వరుస హిట్స్ తర్వాత నాకు వచ్చిన గొప్ప అవకాశం సంక్రాంతికి వస్తున్నాం. అనిల్‌తో కలసి పని చేయడం సందడిగా సంతోషంగా ఉంటుంది. ఆయన దగ్గర నుంచి చాలా విషయాలు తెలుసుకున్నాను. ఈ సినిమా పాటలు ప్రతి ఇంట్లో, ప్రతి పల్లెలో వినిపిస్తున్నాయంటే.. అనిల్‌కి సాహిత్యం, సంగీతంపై ఉన్న అభిరుచే దీనికి కారణం. వెంకటేష్ గారి సినిమాకి పని చేయడం దేవుని దయగా భావిస్తున్నాను. ఈ సినిమాలో బ్లాక్ బస్టర్ పొంగల్ (Blockbuster Pongal) సాంగ్ స్వయంగా ఆయనంతట ఆయనే వచ్చి పాడటం కూడా దేవుని దయగా భావిస్తున్నాను. అదో కలలా అనిపించింది. ఈ సినిమాలో గోదారి గట్టు సాంగ్ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంటూ 70 మిలియన్ వ్యూస్ క్రాస్ చేయడం సంతోషంగా ఉంది. అలాగే నేను పాడిన మీను సాంగ్ 17 మిలియన్ వ్యూస్‌తో ట్రెండింగ్‌లో ఉంది. ఈ సినిమా రీరికార్డింగ్ చేశాను. బ్లాక్ బస్టర్ పొంగల్ సాంగ్ ఎలా అయితే ఉందో.. సినిమా కూడా అదే బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది. పాటలని ప్రేక్షకులు ఇంత గొప్పగా స్వీకరించిన విధానం బట్టి ఈ సినిమా ఉన్నతి ప్రగతి కనిపిస్తోంది. ఈ సినిమా చేయడం గర్వంగా వుంది. ఇది ఫ్యామిలీ అంత కలిసి చూడదగ్గ సినిమా. వెరీ క్లీన్ ఎంటర్ టైనర్. అందరితో కలసి హాయిగా ఎంజాయ్ చేసేలా ఉంటుంది’ అని చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed