- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆగని హింస.. రంగంలోకి కేంద్ర బలగాలు

దిశ, వెబ్ డెస్క్: కేంద్రం చేసిన వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పశ్రిమ బెంగాల్ (West Bengal) రాష్ట్రంలో నిరసనలు చేస్తున్నారు. ఈ నిరసనలు బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లా (Murshidabad District)లో హింసాత్మకంగా మారాయి.నిరసనకారులు మతపరమైన హింసకు దిగడంతో.. ఆ ప్రాంతం మొత్తం అల్లకల్లోలంగా మారింది. దీంతో స్థానికి ప్రజలు ఆ ప్రాంతాన్ని వదిలేసి అక్కడినుంచి వెళ్లిపోతున్నారు. శాంతిభద్రతలను పునరుద్ధరించడానికి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) యొక్క ఐదు కంపెనీలను రంగంలోకి దించారు.
ముర్షిదాబాద్ జిల్లాలో, ముఖ్యంగా సమ్సేర్‌గంజ్, సూటి, ధులియాన్, జంగీపూర్ ప్రాంతాల్లో వక్ఫ్ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. ఈ నిరసనలు ఏప్రిల్ 11 నాటికి తీవ్ర హింసకు దారితీశాయి. ఈ హింసలో సమ్సేర్‌గంజ్ (Samserganj)లో హరోగోబింద్ దాస్ (72), అతని కుమారుడు చందన్ దాస్ (40) మరణించారు. అలాగే సూటిలోని సాజూర్ మోర్‌లో ఇజాజ్ మొమిన్ (21) మరణించాడు. 150 మందికి పైగా అరెస్టయ్యారు, 18 మంది పోలీసులతో సహా అనేక మంది గాయపడ్డారు. కాగా రాష్ట్రంలో నెలకొన్న ఈ పరిస్థితులపై కలకత్తా హైకోర్టు (Calcutta High Court) స్పందించింది.
హింసను అదుపు చేయడానికి కేంద్ర సాయుధ పోలీసు బలగాల (CAPF)తో పాటు BSF యొక్క ఐదు కంపెనీలను ముర్షిదాబాద్‌లోని హింసాత్మక ప్రాంతాలలో మోహరించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా కేంద్ర బలగాల మోహరింపు (Deployment of central forces) తర్వాత.. BSF సౌత్ బెంగాల్ ఫ్రాంటియర్ IG కర్ణీ సింగ్ షెకావత్ మాట్లాడుతూ.. "మేము రాష్ట్ర పోలీసులతో సమన్వయంతో పనిచేస్తున్నాము. ఐదు కంపెనీలను పంపాము. అవసరమైతే మరిన్ని బలగాలను అందిస్తాము. BSF స్వతంత్రంగా కాకుండా పోలీసులకు సహాయం అందిస్తాము. ఇప్పటికే ముర్షిదాబాద్ (Murshidabad)లో స్థానికంగా 300 BSF సిబ్బంది ఉన్నారు. ఇందుకు అదనంగా ఈ ఐదు కంపెనీలు (Five companies) సుమారు 500 నుంచి 600 మంది సిబ్బంది రంగంలో ఉన్నారని ఆయన తెలిపారు.