కిరణం షాప్ లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్..

by Kalyani |
కిరణం షాప్ లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్..
X

దిశ, మేడిపల్లి: కిరణం షాప్ లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తి ని అరెస్ట్ చేసిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చెంగిచర్ల భగత్ సింగ్ నగర్ లో గోలియాల చంద్రయ్య (72) అనే వ్యక్తి కిరణం షాప్ ముసుగులో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నాడు. శనివారం హనుమాన్ జయంతి సందర్భంగా మద్యం విక్రయాలు నిలిపివేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులకు విరుద్ధంగా డబ్బే ధ్యేయంగా అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నాడని విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు షాప్ పై రైడ్ చేసి మద్యం విక్రయిస్తున్న చంద్రయ్య అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ఐదు లీటర్ల మద్యాన్ని సీజ్ చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అక్రమంగా మద్యం విక్రయాలు చేసిన, బెల్టు షాపులు నిర్వహించిన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని మేడిపల్లి సీఐ గోవింద రెడ్డి హెచ్చరించారు.

Next Story

Most Viewed