- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నేడు వనజీవి రామయ్య అంత్యక్రియలు.. ఖమ్మంకు బయలుదేరిన మంత్రి పొంగులేటి
by Shiva |

X
దిశ, వెబ్‌డెస్క్: హరిత ప్రేమికుడు, పద్మశ్రీ దరిపల్లి రామయ్య (Daripally Ramaiah) (87) అలియాస్ వనజీవి రామయ్య శనివారం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఖమ్మం (Khammam) జిల్లా ఏదులాపురం (Edulapuram) మున్సిపాలిటీ పరిధిలోని రెడ్డిపల్లి (Reddypally) గ్రామానికి చెందిన వనజీవి రామయ్య మృతితో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పర్యావరణ ప్రేమికులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ క్రమంలోనే కాసేపట్లో స్వగ్రామం రెడ్డిపల్లిలో వనజీవి రామయ్య అంత్యక్రియలను తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) అధికారికంగా నిర్వహించనుంది. ఈ మేరకు ప్రభుత్వం తరఫున అంత్యక్రియలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) హాజరై నివాళులర్పించనున్నారు. కాసేపటి క్రితమే ఆయన హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి రోడ్డు మార్గాన ఖమ్మంకు బయలుదేరారు.
Next Story