- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Gold Seize: ముంబై ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ తనిఖీలు.. 6.7 కిలోల గోల్డ్ సీజ్

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా బంగారం (Gold) ధరలు ఆకాశాన్నంటుతోన్న వేళ గోల్డ్ అక్రమ రవాణాపై కేంద్ర ప్రభుత్వం (Central Government) అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా విదేశాల నుంచి దొంగచాటుగా బంగారం తీసుకొస్తే స్పెషల్ డ్రైవ్ (Special Drives)లు నిర్వహించి ఉక్కుపాదం మోపాలని సెంట్రల్ ఇంటెలిజెన్స్ (Central Intelligence), కస్టమ్స్ అధికారుల (Customs Officials)కు సూచించింది. ఈ క్రమంలోనే ప్రధాన నగరాల్లో ఉన్న ఎయిర్‌పోర్టులు (Airports), ఓడరేవు (Ports)ల్లో కస్టమ్స్ అధికారులు (Customs officials) అధికారులు నిత్యం జల్లెడ పడుతున్నారు. అదేవిధంగా ఆయా రాష్ట్రాల్లో అనుమానం వచ్చిన ప్రతి బ్యాగేజీలు, కంటైనర్లను క్లియర్‌గా చెక్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇవాళ కస్టమ్స్ అధికారులు (Customs Officials) ముంబై (Mumbai)లోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్టు (Chhatrapati Shivaji Maharaj International Airport)లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. అనంతరం బ్యాంకాక్ (Bangkok) నుంచి ముంబై (Mumbai)కి వచ్చిన ఫ్లైట్‌లో ప్రయాణికులను తనిఖీ చేయగా.. ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో అతడిని అదపులోకి తీసుకుకి చెక్ చేయగా.. షూలో సుమారు. 6.7 కిలోల బంగారం లభ్యమైంది. అయితే, అందుకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో గోల్డ్ (Gold)ను సీజ్ చేశారు. పట్టుబడిన బంగారం విలువ బహిరంగా మార్కెట్‌లో రూ.6.3 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు అంచనా వేస్తున్నారు. అనంతరం నిందితుడితో పాటు మరొకరిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.