- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Ram Charan Game Changer : రామ్ చరణ్ అద్భుతమైన నటుడు
దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)పై ఏపీ మంత్రి కందుల దుర్గేశ్(Kandula Durgesh) ప్రశంసల వర్షం కురిపించారు. శనివారం రాజమహేంద్రవరంలో నిర్వహించిన గేమ్ ఛేంజర్(Game Changer) సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. ఈ ఫంక్షన్‌లో పాల్గొన్న ఆయన మాట్లాడారు. రామ్ చరణ్ చాలా పరిణితి చెందిన నటుడు అని అన్నారు. ఒక్కో మెట్టు ఎక్కుతూ తండ్రికి తగ్గ తనయుడిగా ఎదుగుతున్నారని అభినందించారు. ఇదిలా ఉండగా.. గేమ్ ఛేంజర్ చిత్రబృందానికి ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. టికెట్ రేట్ల పెంపు కోసం నిర్మాతలు చేసిన విజ్ఞప్తికి ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు ఇవాళ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రాత్రి ఒంటిగంట బెనిఫిట్ షో టికెట్ ధర 600 రూపాయలుగా నిర్ణయించారు. జనవరి 10 నుంచి జనవరి 23 వరకు రోజుకు ఐదు షోల చొప్పున వేసుకునేందుకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం ఆ మేరకు వీటి టికెట్ రేట్లను కూడా ఖరారు చేసింది. శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మించారు.
Read More : Game changer: ఆయనతో పని చేయడాన్ని ఎంతో ఎంజాయ్ చేశాను: రామ్ చరణ్