Owaisi: రోశయ్య, కిరణ్ కుమార్, వైఎస్ఆర్ వేరు.. రేవంత్ రెడ్డి వేరు

by Gantepaka Srikanth |   ( Updated:2025-01-06 15:26:16.0  )
Owaisi: రోశయ్య, కిరణ్ కుమార్, వైఎస్ఆర్ వేరు.. రేవంత్ రెడ్డి వేరు
X

దిశ, వెబ్‌డెస్క్: పాతబస్తీ మెట్రోపై ఎంఐఎం(MIM) చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం నగరంలోని నెహ్రూ జూపార్కు నుంచి ఆరాంఘర్‌ వరకు 4.08 కిలోమీటర్ల పొడవునా దాదాపు రూ.800 కోట్లతో నిర్మితమైన ఫ్లైఓవర్‌ను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అసదుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసద్ మాట్లాడుతూ.. గతంలో ఉమ్మడి రాష్ట్రానికి చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో పాతబస్తీకి మెట్రో ప్రస్తావణ తీసుకొచ్చారని గుర్తుచేశారు. అది తర్వాత వైఎస్ఆర్(YSR), రోశయ్య(Roshaiah), కిరణ్ కుమార్ రెడ్డి(Kiran Kumar Reddy) ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. వారి తర్వాత పదేళ్ల అధికారంలో ఉన్న కేసీఆర్‌‌(KCR)కు కూడా పాతబస్తీ వరకు మెట్రో తీసుకురావాలనే ఆలోచన రాలేదని తెలిపారు. తామే మెట్రోను అడ్డుకుంటున్నామని ఎంఐఎంపై నిందలు వేశారని అన్నారు.

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే మెట్రోకు శంకుస్థాపన చేశారని కొనియాడారు. అంతకుముందు పనిచేసిన ముఖ్యమంత్రులు వేరు.. రేవంత్ రెడ్డి వేరు అని అన్నారు. అంతకుముందు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వస్తున్నట్లు తెలిపారు. నగర అభివృద్ధిలో భాగంగా మెట్రో విస్తరించాల్సిన అవసరం ఉంది. మూసీ నది పునరుజ్జీవనం జరగాల్సి ఉంది. ఆక్రమణల వల్ల హైదరాబాద్‌ సుందరీకరణ దెబ్బతింటోంది. హైదరాబాద్‌ అభివృద్ధి కోసం కాంగ్రెస్‌, ఎంఐఎం కలిసి పని చేస్తోందని అన్నారు.

Advertisement

Next Story