- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Game changer: ఆయనతో పని చేయడాన్ని ఎంతో ఎంజాయ్ చేశాను: రామ్ చరణ్
దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘గేమ్ చేంజర్’ (Game changer). కియారా అద్వాణీ (Kiara Advani) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ముంబైలో ప్రెస్ మీట్ నిర్వహించారు చిత్ర బృందం.
ఈ ఈవెంట్‌లో రామ్ చరణ్ మాట్లాడుతూ.. ‘శంకర్‌తో సినిమా చేయడం నా అదృష్ణం. ఆర్ఆర్ఆర్ (RRR) టైంలో ఉన్నప్పుడే దిల్ రాజు శంకర్ కథ చెబుతారు వినండి అని చెప్పారు. నేను వెంటనే షాక్ అయ్యాను. శంకర్ చెప్పిన కథ అద్భుతంగా అనిపించింది. ఆయన ప్రతీ విషయంలో ఎంతో పర్టిక్యులర్‌గా ఉంటారు. ప్రతీ దాన్ని ఎంతో పర్ఫెక్ట్‌గా చేయాలని చూస్తుంటారు. రాజమౌళి, శంకర్ ఇద్దరూ కూడా టాస్క్ మాస్టర్లే. సెట్‌లోకి నేను వచ్చినప్పుడు నన్ను కాకుండా నా హెయిర్‌ను చూశారు. ఆయన అనుకున్న దాని కంటే ఓ ఐదు శాతం తగ్గింది. అంత తీక్షణంగా ఆయన ప్రతీ ఒక్క విషయాన్ని పరిశీలిస్తుంటారు. ఆయనతో పని చేయడాన్ని నేను ఎంతగానో ఎంజాయ్ చేశాను. గేమ్ చేంజర్ సినిమా జనవరి 10న రాబోతోంది. అందరికీ నచ్చేలా ఈ చిత్రం ఉంటుంది’ అని చెప్పుకొచ్చాడు.
Read More : Ram Charan Game Changer : రామ్ చరణ్ అద్భుతమైన నటుడు