Tirupati: ఆర్టీసీ బస్సులో యువకుడి ఆత్మహత్య

by Rani Yarlagadda |
Tirupati: ఆర్టీసీ బస్సులో యువకుడి ఆత్మహత్య
X

దిశ, వెబ్ డెస్క్: ఓ యువకుడు ఆర్టీసీ బస్సులో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తిరుపతి జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. ఏర్పేడు సమీపంలోకి బస్సు రాగానే యువకుడు ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. బస్సులో ఉన్న కండక్టర్ రేణిగుంట సమీపంలోకి బస్సు రాగానే దీనిని గుర్తించాడు. బస్సు నిండా ప్రయాణికులుంటే వెంటనే తెలిసేది. ముగ్గురు మాత్రమే ఉండటంతో.. ముందున్న కండక్టర్ యువకుడిని గమనించలేదు. బస్సు చివరి సీటులో కూర్చున్న యువకుడు హ్యాంగర్ కు ఉరేసుకుని చనిపోయాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా.. మృతుడి వివరాలు, ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story