- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖుల భేటీ పై స్పందించిన హీరోయిన్
దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth)తో సినీ ప్రముఖుల సమావేశం ఇవాళ(గురువారం) కమాండ్ కంట్రోల్ రూమ్ ఆఫీస్‌లో జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సినీ ప్రముఖుల భేటీ పై ప్రముఖ నటి, నిర్మాత ఛార్మీ కౌర్ (heroine Charmi Kaur) తాజాగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం(Telangana govt), సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని ఆమె ట్విట్టర్ వేదికగా తెలిపారు.
వారి విజనరీ నాయకత్వం, చిత్ర పరిశ్రమ(Cinema Industry) పట్ల వారి స్థిరమైన నిబద్ధత అభినందనీయమని ఛార్మీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల(Development Programs)కు నా మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఆమె తెలిపారు. సినీ పరిశ్రమకు, సమాజానికి లబ్ధి చేకూర్చే సంక్షేమ కార్యక్రమాల పట్ల చైతన్యం కలిగించేందుకు మనస్ఫూర్తిగా తోడ్పాటు అందిస్తాను అన్నారు. కీలకమైన సామాజిక సమస్యలపై అవగాహన కలిగించేందుకు కట్టుబడి ఉంటాను. చిత్ర పరిశ్రమ ఉజ్వల భవిష్యత్తుకు కలసికట్టుగా కృషి చేద్దాం అని ఛార్మీ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read More...
అల్లు అర్జున్, రానా లాంటి సూపర్ స్టార్లు మాకు గర్వకారణం: సీఎం రేవంత్ రెడ్డి