పెళ్లికి ముందు చైతు, శోభిత మధ్య చిచ్చు పెట్టిన యంగ్ బ్యూటీ.. నెట్టింట వైరల్‌గా మారిన ట్వీట్

by Hamsa |
పెళ్లికి ముందు చైతు, శోభిత మధ్య చిచ్చు పెట్టిన యంగ్ బ్యూటీ.. నెట్టింట వైరల్‌గా మారిన ట్వీట్
X

దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya), శోభిత ధూళిపాళ(Shobitha Dhulipala) ఇటీవల ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరు డిసెంబర్‌లో అన్నపూర్ణ స్టూడియో(Annapurna Studio)లో పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే వీరి పెళ్లికి సంబంధించిన పనులు కూడా స్టార్ట్ అయిపోయాయి. కార్డ్స్ కూడా అందరికీ పంచేస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, ఓ యంగ్ హీరోయిన్‌పై నాగచైతన్యతో ఉన్న ఫొటో షేర్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టింది. దీంతో అది చూసిన నెటిజన్లు పెళ్లికి ముందుకు కాబోయే భార్య భర్తల మధ్య చిచ్చు పెట్టేసిందిగా అని చర్చించుకుంటున్నారు.

అసలు విషయంలోకి వెళితే.. ‘మజిలీ’ సినిమాలో నాగచైతన్య లవర్‌గా నటించిన యంగ్ బ్యూటీ దివ్యాంశ కౌశిక్(Divyansha Kaushik)వార్తల్లో నిలిచింది. నాగచైతన్య పుట్టినరోజు కావడంతో ‘X’ ద్వారా ఓ ట్వీట్ చేయడంతో అతి కాస్త సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. అందులో ఏముందంటే.. సినిమాలో ఉన్న పేరుతో ‘‘హ్యాపీ బర్త్ డే పూర్ణ మాయా’’ అనే క్యాప్షన్ జత చేసింది.

అంతేకాకుండా మూడు బ్లాక్ కలర్ హార్ట్ సింబల్స్ యాడ్ చేయడంతో పాటు ఓ ఫొటోను కూడా షేర్ చేసింది. అయితే దివ్యాంశ గతంలో కూడా సమంత, నాగచైతన్య విడాకులకు కారణం అయిందనే వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఈ ట్వీట్‌తో శోభిత, చైతు మధ్య చిచ్చు పెట్టిందని అంటున్నారు. కాబోయే భర్తకు శోభిత విషెస్ చెప్పకపోయినా దివ్యాంశ భర్తను పిలిచినట్లు మాయ అని పిలవడంతో పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కానీ అక్కినేని అభిమానులు మాత్రం అవన్నీ కొట్టిపారేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed