- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కిడ్నీల ఆరోగ్యానికి మేలు చేసే మూడు యోగాసనాలు
దిశ, ఫీచర్స్: ఈ రోజల్లో చాలామందికి కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. శరీరంలోని వివిధ భాగాల్లో పేరుకుపోయిన వ్యర్థాలను కిడ్నీలు తొలగిస్తాయి. ఈ ప్రక్రియలో అంతరాయం ఏర్పడితే అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే, ఆహారపు అలవాట్లతో పాటు జీవనశైలిలో కొన్ని మార్పులు చేయాలి. హెల్తీ ఫుడ్స్ తినడం, వ్యాయమాలు చేయడం వల్ల వీటిని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండి, వాటి పనితీరు మెరుగుపడేందుకు కొన్ని యోగాసనాలు ఉపయోగపడతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చక్రాసనం: ఇది కాలేయం, ప్లీహము, మూత్రపిండాల ప్రక్రియను ప్రేరేపిస్తుంది. శరీరంలో ఒత్తిడిని తగ్గించి, చేతులు, కాళ్ళ కండరాలను బలంగా మారుస్తుంది. ముందుగా యోగా మ్యాట్‌పై వెల్లకిలా పడుకోవాలి. తరువాత చేతులను తలకు ఇరుపక్కగా పెట్టి, పాదాలు నేలపై ఉంచి, శరీరాన్ని పైకి లేపడానికి ప్రయత్నించండి. దీనిని సరిగ్గా చేశారంటే ఇది చూడటానికి చక్రంలా కనిపిస్తుంది. ఇలా చేయడం వల్ల ఛాతి విస్తరించి, ఊపిరితిత్తుల సామర్థ్యం మెరుగుపడుతుంది.
ధనురాసనం: ఈ ఆసనాన్ని ప్రతిరోజూ చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కిడ్నీలు, కాలేయం పనితీరును సజావుగా సాగేలా చేస్తుంది. డయాబెటిస్‌తో బాధపడేవారికి ఈ ఆసనం ప్రయోజనకరంగా ఉంటుంది. ముందుగా కింద బోర్లా పడుకుని, మోకాళ్లను వీపువైపుకు మడవాలి. ఆ తరువాత రెండు చేతులతో యాంకిల్‌ను పట్టుకోవాలి. నెమ్మదిగా శరీర కింద భాగాన్ని పైకి లేపాలి. పొత్తికడుపుపై శరీర భారం ఎక్కువగా ఉంటుంది. ధనస్సు వంచినట్లుగా శరీరాన్ని ఉంచాలి. ఇలా 30 సెకన్ల పాటు ఉంటే ప్రయోజనం ఉంటుంది. దీనిని ప్రతి రోజూ చేస్తున్నట్లైతే జీర్ణవ్యవస్థకు మేలు జరుగుతుంది.
పశ్చిమోత్తానాసనం: ఈ ఆసనం చేయడం వల్ల కిడ్నీ, కాలేయం ప్రేరణ చెంది, పని తీరు మెరుగవుతుంది. అంతేకాకుండా జీర్ణక్రియ ప్రక్రియ సజావుగా సాగుతుంది. తలనొప్పి, ఆందోళన, అధిక రక్తపోటును తగ్గిస్తుంది. ముందుగా కింద కూర్చొని రెండుకాళ్లను ముందుకు చాపాలి. ఆ తరువాత పాదాలను కాస్త వెనక్కి వంచి, రెండు చేతులతో కాలి వేళ్లను పట్టుకోవాలి. ఇలా పట్టుకునే సందర్భంలోనే.. ఛాతి భాగం తొడలకు తాకేలా ఉండాలి. ఇలా సుమారు 20 లేదా 30 సెకన్ల పాటు ఉండాలి. ఇలా రెండు లేదా మూడు సార్లు చేయాలి.
*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.