Lips: చలికి లిప్స్ పగులుతున్నాయా.. లిప్‌బామ్ బదులు వీటిని రాస్తే అందంగా, కోమలంగా మారుతాయి!!

by Anjali |
Lips: చలికి లిప్స్ పగులుతున్నాయా.. లిప్‌బామ్ బదులు వీటిని రాస్తే అందంగా, కోమలంగా మారుతాయి!!
X

దిశ, వెబ్‌డెస్క్: శీతాకాలం(winter) వస్తే పెదాలు పగిలిపోతాయి. తగినంత నీరు తాగకపోవడం వల్ల కూడా చర్మం, పెదవులు(LIPS) పొడిబారిపోతాయి. విటమిన్ బి, ఐరన్ ఇతర పోషకాల లోపం ఏర్పడుతుంది. సాల్టీ()Salty, మసాలా ఫుడ్స్(Spicy foods) అతిగా తినడం.. కొన్ని రకాల మందులు ఉపయోగించడం వల్ల కూడా పెదవులు పగలడానికి దారితీస్తాయి. అయితే పగిలిన పెదాలను కొరికితే సమస్య మరింత తీవ్రమవుతుంది. కాగా ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే లిప్‌బామ్‌(Lip balm)కు బదులుగా కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలంటున్నారు నిపుణులు. దీంతో పెదాలు అందంగా, కోమలంగా తయారవుతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

యాంటీఆక్సిడెంట్లు(Antioxidants), యాంటీ బ్యాక్టీరియల్(Anti bacterial) గుణాలు పుష్కలంగా ఉండే దోసకాయ(Cucumber) ముక్కలతో పెదాలపై రాస్తే పెదాలు అందంగా తయారవుతాయి. అలాగే కొబ్బరినూనె(coconut oil) పెదాల అందాన్ని పెంచడంలో మేలు చేస్తుంది. కొబ్బరి ఆయిల్ తో లిప్స్ ను మసాజ్ చేస్తే కోమలంగా మారుతాయి. ఇక తేనె ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. రాత్రి పడుకునేటప్పుడు తేనే పెదాలకు అప్లై చేసి పడుకుంటే పగలకుండా ఉంటాయి.

ఫ్రాగ్సెన్స్ ఫ్రీ పెట్రోలియం జెల్లీ(Fragance free petroleum jelly) కూడా పెదాలను మృదువుగా ఉంచడంలో ఉపయోగపడుతుంది. ఇది రాస్తే పెదాలు ఎప్పుడూ హైడ్రేట్‌(Hydrate)గా ఉంటాయి. అంతేకాకుండా రిచ్ విటమిన్స్, ఫ్యాటీ యాసిడ్స్(Fatty acids) దట్టంగా ఉండే షియా బటర్ పెదాలను సాఫ్ట్‌గా మార్చడంలో మేలు చేస్తాయి. వీటితో పాటు వాటర్(Water) ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే గాలిలో తేమ కారణంగా లిప్స్ డ్రైగా మారుతాయి. కాగా శరీరానికి కావాల్సినంతగా నీరు తాగాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్(Omega 3 fatty acids) ఎక్కువగా చేపల్ని తినడం వల్ల కూడా స్కిన్, లిప్స్ డ్రైగా మారకుండా ఉంటాయి.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed