- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Lokmanthan : విశ్వశాంతికై మోడీ ప్రయత్నం! లోక్‌మంథన్ ముగింపు వేడుకల్లో కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లోని హైటెక్ సిటి శిల్పకళా వేదికలో ఆదివారం (Lokmanthan) లోక్‌మంథన్-2024 కార్యక్రమం ముగింపు వేడుకలు నిర్వహించారు. నాలుగు రోజుల పాటు జరిగిన లోక్ మంథన్‌లో వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, గజేంద్ర సింగ్ షేకావత్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ (RSS Mohan Bhagwat) హాజరయ్యారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్‌రెడ్డి (Kishan Reddy) మాట్లాడుతూ.. దేశంలో ఆధ్యాత్మికత పెరుగుతుండడం, అభివృద్ధి జరుగుతుండడంతో కొన్ని శక్తులు సహించలేక పోతున్నాయని అన్నారు. అరాచకాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని వెల్లడించారు. దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్న సమయంలో అంతర్జాతీయ వేదికలపై విశ్వశాంతి కోసం మోడీ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. దేశాన్ని విశ్వగురువుగా చేయడం కోసం అందరం కలిసి ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు.