DY Chandrachud: కొలిజియం వ్యవస్థలపై అపోహలు తొలగించాలి- జస్టిస్ డీవై చంద్రచూడ్

by Shamantha N |
DY Chandrachud: కొలిజియం వ్యవస్థలపై అపోహలు తొలగించాలి- జస్టిస్ డీవై చంద్రచూడ్
X

దిశ, నేషనల్ బ్యూరో: సుప్రీం కోర్టు(Supreme Court), హైకోర్టుల్లో(High Court) జడ్జిల నియామకానికి చెందిన కొలిజియం వ్యవస్థపై మాజీ సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్(DY Chandrachud) కీలక వ్యాఖ్యలు చేశారు. కొలిజియం వ్యవస్థపై ఉన్న అపోహలు తొలగించాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. ఎన్డీటీవీ నిర్వహించిన సంవిధాన్‌@75 కాంక్లేవ్‌లో ఆయన ప్రసంగించారు. న్యాయమూర్తుల నియామకాలు మరింత పారదర్శకంగా ఉండాలని అన్నారు. కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల మధ్య అధికార పంపిణీ స్పష్టంగా ఉండాలని పేర్కొన్నారు.

వివిధ దశల్లో జడ్జిల నియామకం

జడ్జిల నియామకం వివిధ దశల్లో జరుగుతుందని జస్టిస్ చంద్రచూడ్ వివరించారు. కేవలం సుప్రీం కోర్టు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోదన్నారు. కొలిజయంకు ఫెడరల్‌ వ్యవస్థలో వివిధ దశల్లో బాధ్యతలు అప్పగించారని తెలిపారు. జడ్జి నియామకానికి ఇఁటెలిజెన్స్ నివేదికలపైనే కాకుండా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్ల అభిప్రాయాలు సేకరించి తుది నిర్ణయం తీసుకుంటామని అన్నారు. వివిధ వర్గాలు, ప్రాంతాలకు ప్రాతినిధ్యం, వారి సీనియారిటీ, నిబద్ధత వంటి అంశాలను పరిగణలోకి తీసుకొంటారని తెలిపారు. కోర్టులు, ప్రభుత్వాల మధ్య అధికార విభజన మరో ప్రత్యేక అంశమని చెప్పుకొచ్చారు. ఇది కూడా చాలావరకు మారాల్సి ఉంటుందని.. పాలసీలు అవసరమని అన్నారు. ప్రజాస్వామ్యంలో అధికారాల విభజన ప్రాథమిక అంశమని.. అది ఇంకా మన వ్యవస్థలో ఉందని పేర్కొన్నారు.

Advertisement

Next Story