- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP: ‘ఆ పాపం ఫలితంగానే 11 సీట్లకు పరిమితమయ్యారు’.. మంత్రి సంచలన వ్యాఖ్యలు
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో తాజాగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కూటమి ప్రభుత్వం పై చేసిన వ్యాఖ్యల పై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి ఘాటుగా స్పందించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. 5 ఏళ్ల పాటు విద్యార్థులను మోసం చేసిన జగన్ అధికారం కోల్పోయాక మొసలి కన్నీరు కార్చుతున్నారని విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ గురించి జగన్ మాట్లాడటం సిగ్గుచేటు అని మండిపడ్డారు. వైసీపీ హయాంలో ఫీజులు కట్టలేదని విద్యార్థులను కాలేజీ యాజమాన్యాలు కనీసం పరీక్షలు కూడా రాయనివ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాడు పరీక్ష పాసైన విద్యార్థులకు సర్ట్ఫికెట్లు ఇవ్వకపోవడంతో పై చదువులకు వెళ్లలేని దుస్థితి ఏర్పడిందని దుయ్యబట్టారు. రూ .3 వేల కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెట్టింది మీరు కాదా జగన్? అని ఆయన ప్రశ్నించారు. జగన్ బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేశారని.. ఆ పాపం ఫలితంగానే 11 సీట్లకు పరిమితమయ్యారని ఆయన విమర్శించారు. మేం విడతల వారీగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లిస్తాం, కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఏ ఇబ్బంది రానివ్వదు, విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు మా ప్రభుత్వం బాటలు వేస్తోందని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి పేర్కొన్నారు.