- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రేటర్ లో పెరుగుతున్న చలి…
దిశ, హైదరాబాద్ బ్యూరో : గ్రేటర్ హైదరాబాద్ లో రోజు రోజుకు పెరుగుతున్న చలి కారణంగా ప్రజలు శ్వాస కోశ వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రతినిత్యం కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదౌతుండగా చలి తీవ్రత పెరిగి చిన్న పిల్లలు, వృద్ధులు పడరాని పాట్లు పడుతున్నారు . దగ్గు, జలుబు, జ్వరం, ఆస్తమా, బ్రాంకైటిస్ , కీళ్ల నొప్పులు , చర్మం పొడిగా మారి పగుళ్లు రావడం , ఛాతిలో నెమ్ము చేరడం వంటి సమస్యలతో బాధ పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా దగ్గు, జలుబు వంటివి అధికంగా ఉండటంతో ప్రజలు తీవ్ర మానసిక ఆందోళన చెందుతున్నారు . చలి ప్రభావం చిన్న పిల్లలపై అధికంగా చూపుతోంది. దీంతో ఆస్పత్రులలో రద్దీ పెరిగింది. ముఖ్యంగా చిన్న పిల్లల దవాఖానలు కిటకిటలాడుతుండగా పాఠశాలల్లో సైతం విద్యార్థుల హాజరు శాతం తగ్గుతోంది.
అలర్జీ లక్షణాలు....
గ్రేటర్ పరిధిలో పెరుగుతున్న చలి కారణంగా పిల్లలు, వృద్ధులలో అలర్జీ లక్షణాలు అధికంగా కనబడుతున్నాయి. కాళ్లు, చేతులపై చర్మం ముడత పడడంతో పాటు కీళ్ల సంబంధిత సమస్యలు వస్తున్నాయి. కొంతమందిలో శ్వాసకోశ సమస్యలు కన్పిస్తున్నాయి. చర్మం పొడిబారడం కారణంగా దురద, మంటతో పాటు పగుళ్లు ఏర్పడుతున్నాయి. చాలా మందిలో జ్వర లక్షణాలు కనబడుతుండడంతో ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు .
ముందు జాగ్రత్తలు తప్పనిసరి...
చలి కాలంలో శ్వాసకోశ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చిన్నపిల్లలను చలిగాలిలో తిప్పకుండా వెచ్చని వాతావరణంలో ఉండేలా తల్లిదండ్రులు చూడాలి. వారిని తప్పనిసరై బయటకు తీసుకువెళ్లాల్సి వస్తే తలకు మంకీ క్యాప్, ఒంటికి స్వెటర్ వేయడం తప్పనిసరి. చలి గాలులు ఎక్కువగా వీచే సమయంలో ఎముకలు, జాయింట్లు, కండరాల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. దగ్గు, జలుబు తో పాటు చర్మ సమస్యలు కూడా తలెత్తవచ్చు. అంతేకాకుండా బిపి ఉన్నవాళ్లు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
రోగనిరోధక శక్తిని పెంచాలి....
చలి తీవ్ర ప్రభావం చూపుతున్న ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరూ రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి. ఆహారం వేడి వేడిగా ఉన్నప్పుడే తినాలి. ఆకుకూరలు, గుడ్లు , పాలు, పప్పుల వంటివి అధికంగా తీసుకోవాలి. చలికాలంలో పొగమంచు అధికంగా ఉన్న సమయంలో చాలా మంది వ్యాయామం, నడక వంటివి తెల్లవారుజాముననే చేస్తుంటారు. ఇలా చేయడంతో లాభం కంటే నష్టమే ఎక్కువని, చలి, మంచు లో నడక శ్వాసకోశ వ్యాధులకు దారితీస్తుంది. అవకాశం ఉన్నవారు ఉదయం తొమ్మిది గంటల తర్వాతనే బయటకు రావాలని, సాయంత్రం 5 గంటల లోపు ఇండ్లకు చేరుకోవాలి.
ప్రయాణాలకు తప్పని తిప్పలు..
ఉదయం వేళల్లో రహదారులన్నీ పొగమంచు కప్పుకోవడం తో ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రతి రోజూ ఉదయం నుంచే చల్లటి గాలులు మొదలవుతుండగా సాయంత్రం 6 గంటల తర్వాత చలి తీవ్రత క్రమ క్రమంగా పెరుగుతోంది. దీంతో త్వరగానే పనులు ముగించుకుని ఇంటికే పరిమితమవుతున్నారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ రోడ్లపై పని చేసే పారిశుధ్య కార్మికులు, పాల వ్యాపారులు, పేపర్ బోయ్స్ పడుతున్న బాధలు వర్ణనాతీతంగా మారగా చలి నుంచి ఉపశమనం పొందేందుకు పడరాని పాట్లు పడుతున్నారు.