చింతలపాలెం మండల అభివృద్ధికి 32.97 కోట్లు

by Naveena |
చింతలపాలెం మండల అభివృద్ధికి 32.97 కోట్లు
X

దిశ, చింతలపాలెం: చింతలపాలెం మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మల్లారెడ్డిగూడెం,కిష్టపట్టే ప్రజలకి నాకు 30 సంవత్సరాల నుంచి అనుబంధం ఉందని, నన్ను ఆరుసార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీగా నన్నుఆదరించారన్నారు. ప్రజల అభివృద్ధి తన బాధ్యత గా భావించానని, గతంలో తన హయాంలోనే చింతలపాలెం,కిష్టపట్టికి రోడ్లు మంజూరయ్యాయన్నారు. చింతలపాలెం మండలంలో గత ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు మంజూరు చేయలేదని,చాలీచాలని అద్దే రూముల్లో ప్రభుత్వ కార్యాలయాలు నిర్వహించారన్నారు. ఇప్పుడు ప్రజా ప్రభుత్వం వచ్చిందని ఇక అభివృద్ధికి తిరుగుండదన్నారు. మొదటి భాగంగానే చింతలపాలెం మండలానికి 32.97 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నామని, చింతలపాలెం మండలం కేంద్రానికి ముఖ్య అనుసంధానమైన మేళ్లచెరువు చింతలపాలెం రోడ్ అభివృద్ధికి పది కోట్ల మంజూరు చేశామన్నారు. పిఆర్ ఫ్యాక్టరీ నుంచి కిష్టాపురం రోడ్డు కొరకు 15 కోట్లు ప్రభుత్వ కార్యాలయాలైనటువంటి ఎమ్మార్వో ఆఫీస్ కు 2.60కోట్లు, ఎంపీడీవో ఆఫీస్ కు 2.98కోట్లు, పోలీస్ స్టేషన్ కు 2.38కోట్లు మంజూరు చేశామన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి నాకు ముఖ్యమని,ఈ ప్రాంత ప్రజల సహకారానికి కృతజ్ఞతలు తెలియజేయడానికే చింతలపాలెం వచ్చానన్నారు.ఈ శంకుస్థాపన కార్యక్రమంలో సూర్యపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్,అడిషనల్ ఎస్పీ,ఆర్&బి అధికారులు,చింతలపాలెం మండల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed