Minister TG Bharat:బాధితులకు అండగా ఉంటాం.. ఎలాంటి ఆందోళన వద్దు

by Jakkula Mamatha |
Minister TG Bharat:బాధితులకు అండగా ఉంటాం.. ఎలాంటి ఆందోళన వద్దు
X

దిశ ప్రతినిధి, అనంతపురం: గార్లదిన్నె మండలం తలగాసిపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై జరిగిన ప్రమాద ఘటనలో క్షతగాత్రులకు, మృతుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని జిల్లా ఇన్చార్జి మంత్రి టీజీ.భరత్ భరోసా ఇచ్చారు. అనంతపురం నగరంలోని కిమ్స్ సవేరా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ, మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజు, జిల్లా ఎస్పీ జగదీష్, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారితో జిల్లా ఇన్చార్జి మంత్రి మాట్లాడారు. డాక్టర్లు బాగా వైద్యం అందిస్తున్నారా, ప్రమాదం ఎలా జరిగింది అంటూ వివరాలు ఆరా తీశారు. మంత్రి టీజీ.భరత్ మాట్లాడుతూ గాయపడిన వారికి ఎలాంటి ఆందోళన వద్దని ధైర్యం చెప్పారు. చికిత్స ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. 24 గంటలు దాటిన తర్వాత బాధితులకు మళ్ళీ సిటీ స్కాన్ చేయాలని, అనంతరం కూడా ఇంకా చికిత్స అవసరమైతే ప్రభుత్వమే ఖర్చు భరిస్తుందని తెలిపారు. బాధితులకు మంచి చికిత్స అందించాలన్నారు. ఈ సందర్భంగా ప్రమాద వివరాలు, అనంతరం చికిత్సకు సంబంధించిన వివరాలను జిల్లా ఇన్చార్జి మంత్రికి జిల్లా కలెక్టర్ వివరించారు.

Advertisement

Next Story

Most Viewed