Royal Enfield Goan Classic 350: రాయల్​ ఎన్​ఫీల్డ్​ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త బైక్​ లాంచ్.. ధర ఎంతంటే..!​

by Maddikunta Saikiran |
Royal Enfield Goan Classic 350: రాయల్​ ఎన్​ఫీల్డ్​ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త బైక్​ లాంచ్.. ధర ఎంతంటే..!​
X

దిశ, వెబ్‌డెస్క్: రాయల్ ఎన్​ఫీల్డ్(​Royal Enfield)బైకులకు భారతీయ మార్కెట్(Indian Market)లో మంచి డిమాండ్ ఉందన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ బైక్‌ను యూత్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సంస్థ నుంచి మరో బైక్ విడుదలైంది. 'రాయల్ ఎన్​ఫీల్డ్​ గోవాన్ క్లాసిక్ 350(Royal Enfield Goan Classic 350)' పేరుతో దీన్ని లాంచ్ చేసింది. తన ఓల్డ్ మోడల్ బాబర్ మోటార్ సైకిల్ స్టైల్లో లేటెస్ట్ ఫీచర్లతో గోవా(Goa)లో జరిగిన మోటోవర్స్ ఈవెంట్(Motoverse Event)లో ఈ బైక్‌ను ఆవిష్కరించింది. గోవాన్ క్లాసిక్ 350 రెండు వేరియంట్‌లలో లభిస్తుంది. సింగిల్ టోన్, డ్యూయల్ టోన్ ఆప్షన్‌లో లభిస్తుంది. సింగిల్-టోన్ వేరియంట్ ధరను రూ. 2.35 లక్షలు(Ex-Showroom), డ్యూయల్-టోన్ మోడల్ ధరను రూ. 2.38 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది.

ఇక ఫీచర్స్ విషయానికొస్తే.. క్లాసిక్ 350 లాగే ఈ బైక్ 349సిసి J-సిరీస్ ఇంజిన్‌ తో వస్తోంది. ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ తో వచ్చే సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్ 20.2 బీహెచ్​పీ, 27 ఎన్ఎమ్ గరిష్ట టార్క్​ని ఉత్పత్తి చేస్తుంది. ఇక ఈ బైకుకి రెండు వైపులా డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్‌మీటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్, డిజిటల్ అనలాగ్ కన్సోల్‌, ట్రిప్పర్ నావిగేషన్ సిస్టమ్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. డ్యూయల్ ఛానల్ ABS తో వస్తోంది. USB ఛార్జింగ్ పోర్ట్‌లు కూడా ఇందులో ఉన్నాయి. మరోవైపు గోవాన్ క్లాసిక్ 350లో పెట్రోల్ ట్యాంక్, LED హెడ్‌ల్యాంప్, సింగిల్ సీట్, స్వింగర్మ్ వంటివి చాలా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. మైలేజ్ విషయానికి వస్తే లీటర్ పెట్రోల్‌కు 36.2 కి.మీ ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. రేవ్ రెడ్, ట్రిప్ టీల్, పర్పుల్ హేజ్, షాక్ బ్లాక్ కలర్స్ లో ఈ బైక్ కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

Advertisement

Next Story