Parameshwara: ఎన్నికల ప్రచారంలో శరద్, ఉద్ధవ్‌లు విఫలం.. కాంగ్రెస్ నేత సంచలన ఆరోపణలు

by vinod kumar |
Parameshwara: ఎన్నికల ప్రచారంలో శరద్, ఉద్ధవ్‌లు విఫలం.. కాంగ్రెస్ నేత సంచలన ఆరోపణలు
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ (MVA) కూటమి ఓటమిపై కాంగ్రెస్ నేత కర్ణాటక మంత్రి జీ పరమేశ్వర (Parameshwara) సంచలన ఆరోపణలు చేశారు. ఎంవీఏలో భాగస్వాములైన శరద్ పవార్ (Sharad pawar) నేతృత్వంలోని ఎన్సీపీ (Sp), ఉద్ధవ్ థాక్రే (Udhav thakrey) ఆధ్వర్యంలోని శివసేన (UBT)లు ప్రచారంలో విఫలమయ్యాయని ఆరోపించారు. శరద్, ఉద్దవ్ వర్గాలు ప్రణాళికా ప్రకారం క్యాంపెయిన్ చేయలేదని విమర్శించారు. విదర్భ ప్రాంతంలో చాలా సీట్లలో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉన్నప్పటికీ తమకు అవకాశం ఇవ్వలేదన్నారు. అంతేగాక శరద్, ఉద్ధవ్ థాక్రే గ్రూపు మధ్య సమన్వయ లోపం ఉందని, ఫలితంగా టికెట్ ప్రకటనలో ఆలస్యమైందని చెప్పారు. అందుకే భారీ నష్టాన్ని చవి చూడాల్సి వచ్చిందన్నారు.

‘మహారాష్ట్రలో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు చాలా దారుణంగా పనిచేశాయి. ఈ విషయం అందరికీ తెలుసు. ఈ ఫలితాలపై మాజీ సీఎం అశోక్ గెహ్లాట్, భూపేశ్ భఘేల్‌ల ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలంతా కలిసి విశ్లేషించాం. ఎంపిక చేసిన ప్రతి నియోజకవర్గంలో ఈవీఎంలు హ్యాకింగ్‌కు గురవుతున్నాయని మాకు సమాచారం అందింది. ఇది ఎంతో ఆశ్చర్యం కలిగిస్తోంది. వారు ఈవీఎంలను హ్యాక్ చేశారని నమ్ముతున్నాం’ అని తెలిపారు. షిండే ప్రభుత్వం అమలు చేసిన లాడ్లీ బహీన్ యోజన పతకం విజయవంతంగా అమలు చేయడం కూడా మహాయుతికి కలిసొచ్చిందని తెలిపారు. కాగా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎంవీఏ కూటమి ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే.

Advertisement

Next Story