Digital Media : నేడే డిజిటల్ మీడియా ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్

by Y. Venkata Narasimha Reddy |
Digital Media : నేడే డిజిటల్ మీడియా ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్
X

దిశ, వెబ్ డెస్క్ : డిజిటల్ మీడియా ప్రిమియర్ లీగ్(Digital Media Premier Leagu) క్రికెట్ టోర్నమెంట్(Cricket Tournament)పోటీలు నేడు ప్రారంభం కానున్నాయి. యూసఫ్ గూడ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా డిజిటల్ మీడియా క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్ లు జరుగనున్నాయి. ఈరోజు సాయంత్రం 7గంటల నుంచి రాత్రి11 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ టోర్నమెంగ్ ద్వారా తొలిసారిగా డిజిటల్ మీడియా టీమ్ లు మైదానంలో తలబడుతున్నాయి. దాదాపు 20రోజుల పాటు పోటీలు సాగనున్నాయి.

టోర్నమెంట్ నిర్వాహకులుగా ఉన్న ఈవీ స్పోర్ట్స్ మహేందర్, వినయ్ లను మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. నిరంతరం వార్త సేకరణలో వేగంగా పనిచేసే జర్నలిస్టులకు ఈ తరహా పోటీలు మానసిక, శారీరక ఉల్లాసాన్ని అందిస్తాయని, భవిష్యత్తులో మరిన్ని క్రీడలు నిర్వహించాలన్నారు. సినీ హీరో శ్రీకాంత్ ఈ టోర్నమెంటు నిర్వాహకులకు, పాల్గొంటున్న జట్లకు శుభాకాంక్షలు తెలిపారు

Next Story