- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘VT-15’ పూజా కార్యక్రమాలు స్టార్ట్.. ఆకట్టుకుంటున్న హీరో, హీరోయిన్ ఫొటోలు(పోస్ట్)

దిశ, వెబ్‌డెస్క్: మెగా హీరో ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ముకుంద’(Mukundha) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అతను.. ‘కంచె’(Kanche) మూవీతో మంచి విజయం సాధించాడు. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటిస్తూ హీరోగా రాణిస్తున్నాడు. అయితే చివరిగా నటించిన ‘మట్కా’(Matka) మాత్రం అనుకున్నంత విజయం సాధించలేకపోయింది. దీంతో మంచి బ్లాక్ బస్టర్ కల్ట్ కోసం తెగ కష్టపడుతున్నాడు. ఇందులో భాగంగా ఎన్నడూ ట్రై చేయని జోనర్‌తో మన ముందుకు రాబోతున్నాడు.
ప్రస్తుతం వరుణ్ తేజ్ ‘వీటీ-15’(VT-15) అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న మూవీలో నటిస్తున్నాడు. ఇండో - కొరియన్ హారర్ కామెడీ థ్రిల్లర్‌తో రాబోతున్న ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ(Merlapaka Gandhi) దర్శకత్వం వహిస్తున్నాడు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌తో అసోసియేట్ అవుతూ యూవీ క్రియేషన్స్(UV Creations) ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఇటీవలే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై మరింత హైప్ పెంచేశాయి.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ పూజా కార్యక్రమం స్టార్ట్ అయ్యాయి. అంతేకాదండోయ్ ఈ రోజు నుంచే ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అవుతుందని అఫీషియల్‌గా ప్రకటించేశారు. ఇక ఇందులో హీరోయిన్‌గా యంగ్ బ్యూటీ రితికా నాయక్(Rithika Nayak) నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారగా.. వీటిని చూసిన నెటిజన్లు.. మీ పెయిర్ చాలా బాగుందని కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ కార్యక్రమానికి భార్య లావణ్య త్రిపాఠి(Lavanya Tripati), చెల్లెలు నిహారిక(Niharika)తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
Read More..
Sai Dharam Tej: మెగా హీరోకు నోటీసులు పంపిన పోలీసులు.. కారణం అదేనా?