తాళం వేసిన ఇండ్లే వారి టార్గెట్.. ఒక్క రాత్రిలోనే ఆరు ఇండ్లలో చోరీ..

by Sumithra |
తాళం వేసిన ఇండ్లే వారి టార్గెట్.. ఒక్క రాత్రిలోనే ఆరు ఇండ్లలో చోరీ..
X

దిశ, శంకరపట్నం : ఐలేని, కొమురెల్లి జాతరకు మూడు కుటుంబాలు, మరో మూడు కుటుంబాలు బంధువుల ఇండ్లలోకి వెళ్ళగా అదే అదునుగా భావించిన దొంగలు ఆరు ఇళ్ళను దోచుకెళ్ళారు. వివరాల్లోకి వెళితే శంకరపట్నం మండలంలోని లింగాపూర్ గ్రామంలో దొంగలు భారీ దొంగతనానికి పాల్పడ్డారు. తాళం వేసి ఉన్న ఇండ్లనే లక్ష్యంగా చేసుకొని దోపిడీకి తెగబడ్డారు. ఒకటి కాదు, రెండు కాదు ఆరు ఇండ్లలో చొరబడి అర్ధరాత్రి భారీ దొంగతనానికి పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు.

నాగండ్ల శ్రీనివాస్, కాశిరెడ్డి పోసి రెడ్డి, కవ్వ బుచ్చమ్మ, కవ్వ మణమ్మ, గూడ విమల, దేవిడి రాజిరెడ్డి ఇండ్లలో ఆదివారం అర్ధరాత్రి చొరబడి దోచుకెళ్ళినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఓ ద్విచక్ర వాహనాన్ని కూడా దొంగిలించి గ్రామ శివారులో వదిలివేసినట్లు తెలిపారు. దొంగతనం విషయం తెలుసుకున్న హుజురాబాద్ రూరల్ సీఐ పులి వెంకట్, కేశవపట్నం ఎస్సై కొత్తపల్లి రవి ఆరు ఇండ్లను పరిశీలించారు. క్లూస్ లూస్ టీం సహాయంతో వేలిముద్రలను సేకరించారు. చోరీకి గురైన సొత్తు జాతరకు వెళ్ళిన కుటుంబ సభ్యులు వచ్చాకే తెలిసే పరిస్థితి ఉంది.

Next Story