- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కామెడీ పేరుతో ఏది కావాలంటే అది మాట్లాడలేరు: సీఎం ఫడ్నవీస్

దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండేపై స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా (Stand-up comedian Kunal Kamra) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ముంబైలోని ఖార్‌లోని హోటల్ యూనికాంటినెంటల్‌లో జరిగిన స్టాండప్ కమెడియన్ కునాల్ కామ్రా (Kunal Kamra) "నయా భారత్"లో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిండే (Deputy CM Eknath Shinde)ను ద్రోహి అని పరోక్షంగా సూచిస్తూ వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారడంతో ఆగ్రహించిన శివసేన కార్యకర్తలు స్టాండప్ షో జరిగిన హోటల్ పై దాడి చేశారు. కాగా కునాల్ కామ్రా (Kunal Kamra) వ్యాఖ్యలపై మీడియా వేదికగా స్పందించిన సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ (CM Devendra Fadnavis).. కీలక వ్యాఖ్యలు చేశారు. "స్టాండ్-అప్ కామెడీ చేసే స్వేచ్ఛ ఉంది. అలా అని వారు ఏది కావాలంటే అది మాట్లాడలేరు. దేశద్రోహి ఎవరో మహారాష్ట్ర ప్రజలు (People of Maharashtra) నిర్ణయించుకున్నారు. తాను చేసిన వ్యాఖ్యలపై కునాల్ కమ్రా క్షమాపణ చెప్పాలి.
డిప్యూటీ సీఎం పై కమెడియన్ (Comedian) చేసిన వ్యాఖ్యలను సహించబోమని. అతనికి కామెడీ చేసే హక్కు ఉంది.. కానీ డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేను ఉద్దేశపూర్వకంగా అప్రతిష్టపాలు చేయడానికి ఇలా చేస్తుంటే చూస్తూ ఊరుకోము. రాహుల్ గాంధీ చూపించిన ఎర్ర రాజ్యాంగ పుస్తకాన్నే కునాల్ కమ్రా (Kunal Kamra) పోస్ట్ చేశారు. వారిద్దరూ రాజ్యాంగాన్ని చదవలేదు. రాజ్యాంగం మనకు వాక్ స్వేచ్ఛ (Freedom of speech)ను అనుమతిస్తుంది. కానీ దానికి పరిమితులు ఉన్నాయి. 2024 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఓటు వేసి మాకు మద్దతు ఇచ్చారు. దేశద్రోహులు గా ఉన్న వారిని ప్రజలు ఇంటికి పంపారు. బాలా సాహెబ్ ఠాక్రే ఆదేశాన్ని, భావజాలాన్ని అవమానించిన వారికి ప్రజలు వారి స్థానాన్ని చూపించారు. ఒకరు హాస్యాన్ని సృష్టించవచ్చు, కానీ అవమానకరమైన ప్రకటనలు చేయడం అంగీకరించబడదు. ఇతరుల స్వేచ్ఛను భావజాలాన్ని ఆక్రమించలేరు. దీనిని వాక్ స్వేచ్ఛగా సమర్థించలేమని సీఎం ఫడ్నవీస్ చెప్పుకొచ్చారు.