Deputy CM Bhatti : డేటా ఎంట్రీ కీలకమైనది : కుల గణనపై డిప్యూటీ సీఎం భట్టి

by Y. Venkata Narasimha Reddy |
Deputy CM Bhatti : డేటా ఎంట్రీ కీలకమైనది : కుల గణనపై డిప్యూటీ సీఎం భట్టి
X

దిశ, వెడ్ డెస్క్ : కులగణన(Caste census)సమగ్ర కుటుంబ సర్వేలో డేటా ఎంట్రీ కీలకమైనదని, డోర్ లాక్, వలస కుటుంబాల వివరాలను సేకరించి పక్కాగా నమోదు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka)సూచించారు. జార్ఖండ్ రాజధాని రాంచీ నుంచి భట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమగ్ర కుటుంబ సర్వేపై సమీక్ష చేసి ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లుకు పలు సూచనలు చేశారు. సమగ్ర కుటుంబ సర్వే చివరి దశకు చేరుకుంటుందని, డేటా ఎంట్రీ దశ చాలా ముఖ్యమైనదని.. ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకండని అధికారులను ఆదేశించారు. సర్వే దశలో పట్టణ ప్రాంతాల్లో డోర్ లాక్, ఇంటి వద్ద అందుబాటులో లేకపోవడం వంటి కొన్ని సమస్యలు తలెత్తినందునా, అటువంటి వారికి ఫోన్ కాల్ చేసి సర్వే గురించి తెలియజేయడం ద్వారా ఆ వివరాలను క్రమబద్ధకరించుకోవాలని, వారిని అందుబాటులో ఉండమని కోరాలని ఆదేశించారు.

కొన్ని వసతి గృహాల్లో, రెసిడెన్షియల్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కేసులు నమోదవుతున్నాయని, పాఠశాలలలో ఆహారం, పరిశుభ్రతపై ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, యావత్ క్యాబినెట్ ప్రత్యేక దృష్టికి సాధించిందని అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫుడ్ పాయిజన్, అపరిశుభ్రత వంటి అంశాలకు తావు లేకుండా కార్యాచరణ ప్రణాళిక రూపొందించడానికి సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed